Begin typing your search above and press return to search.

సవ్యసాచిలో బేబీ స్టార్ కూడా

By:  Tupaki Desk   |   9 Dec 2017 5:12 AM GMT
సవ్యసాచిలో బేబీ స్టార్ కూడా
X
చైల్డ్ ఆర్టిస్ట్ దిషితా ఇప్పుడు ఇండియా మొత్తం పాపులర్ అయిపోయింది. నాలుగేళ్ల వయసులోనే ఫిలిం ఎంట్రీ ఇచ్చేసిన ఈ చిన్నారి.. బేబీ మూవీలో అక్షయ్ కుమార్ కూతురుగా నటించి మెప్పించింది. సూపర్ సక్సెస్ సాధించిన హిందీ మీడియంలో ఇర్ఫాన్ ఖాన్ కి కూతురుగా నటించిన తర్వాత.. ఈమెకు బోలెడన్ని ఆఫర్స్ వచ్చి పడిపోతున్నాయి.

అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ వెలిగిపోయేందుకు దిషితా సింగ్ రెడీ అయిపోతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న సవ్యసాచి మూవీలో ఈమె కూడా నటిస్తోంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ రూపొందుతున్న ఈ సినిమాలో చాలానే దిషితా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ చేస్తోందట. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హీరో మేనకోడలి పాత్రలో ఈ లిటిల్ కిడ్ నటిస్తోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగా.. తెగ ఎంజాయ్ చేస్తున్నానని చెబుతోంది దిషితా.

వేల కొద్దీ టాయ్స్ తో ఆడుకునే ఓ సన్నివేశం తనకు విపరీతంగా నచ్చేసిందని చెబుతున్న దిషిత.. తను అలా ఆడుకుంటున్న సమయంలో మాధవన్ అంకుల్ చూస్తున్న విషయం తెలీదని.. ఆయనని చూసి షాక్ తినేశానని అంటోంది. మాధవన్ తో ఈమెకు చాలానే సీన్స్ ఉంటాయట. ఏదైనా సమయంలో తను సరిగా చేయలేకపోతే.. 'నువ్వు రాక్ స్టార్.. తప్పుకుండా చేయగలవ్' అంటూ మాధవన్ ప్రోత్సహించారని చెప్పిన దిషిత.. సవ్యసాచి కోసం తెలుగు నేర్చేసుకుంటోంది.