ఆ దిశా.. ఈ భామ.. సేమ్ టు సేమ్

Thu Apr 20 2017 13:38:54 GMT+0530 (IST)

కొందరు అంతే.. అదేంటో కానీ అస్సలు ఎప్పటికీ మారరు. వయసు స్తంభించిపోయిందా.. ఎదుగుదల ఆగిపోయిందా.. ఇలాంటి డౌట్స్ చాలానే వస్తుంటాయ్ కానీ.. వీళ్లలో చిన్నపాటి మార్పులు కూడా కనిపించవు. అలాంటి అవకాశం చాలా అరుదుగా అతి కొద్ది మందికే దక్కుతుంది. వారిలో లోఫర్ బ్యూటీ దిశా పటానీ పేరు కూడా ఉంటుంది.

ఇక్కడ కనిపిస్తున్న ఫోటోస్ లో కనిపిస్తున్న దిశానే అని గ్లామర్ లవర్స్ కు చెప్పక్కర్లేదు. అయితే.. ఈ ఫోటో షూట్ ఎప్పుడు చేసినదో తెలిస్తే ఆశ్చర్యం వేయకమానదు. ఐదారేళ్ల క్రితం.. అంటే దిశా పటానీకి 17 సంవత్సరాల వయసు ఉన్నపుడు చేసిన ఫోటో షూట్ ఇది. దిశా పటానీకి ఇదే మొట్ట మొదటి ఫోటో షూట్ కావడం అసలు పాయింట్. లేటెస్ట్ ఫోటో షూట్ అనిపించేస్తోంది కదూ.. అదే ఆశ్చర్యకరమైన విషయం. అప్పటికి ఇప్పటికీ ముఖ కవళికల్లో కానీ.. మేని మెరుపుల్లో గానీ.. కళ్లలో కనిపించే కాంతులు కానీ ఏ మాత్రం తగ్గడం లేదంటే.. అమ్మడు ఎంత అదృష్టవంతురాలో అర్ధమవుతుంది.

కాకపోతే అప్పుడు ఫుల్ గా డ్రెస్ చేసుకుని కేవలం తన ట్యాలెంట్ ని మాత్రమే చూపించింది. ఇప్పుడు ఫేమ్ బాగా పెరిగింది కదా.. అందుకే గ్లామర్ యాంగిల్ లోకి మారిపోయి.. స్కిన్ షో కూడా మొదలుపెట్టేసింది. అదొక్కటే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/