ఎంత బ్రాండ్ అంబాసిడర్ అయితే మాత్రం మరీ విప్పి చూపాలా?

Tue May 21 2019 11:16:27 GMT+0530 (IST)

మెగా హీరో వరుణ్ తో 'లోఫర్' చిత్రంలో నటించిన దిశా పటాని సినిమాలు లేకున్నా చాలా ఫేమస్ అవుతోంది. తెలుగులో ఈమె నటించిన లోఫర్ చిత్రం ఆకట్టుకోక పోవడంతో మళ్లీ తెలుగులో మంచి ఆఫర్లు రాబట్టకోవడంలో విఫలం అయ్యింది. బాలీవుడ్ కు పరిమితం అయ్యి అక్కడ ఒక మోస్తరు సినిమాల్లో నటించి పర్వాలేదు అనిపించుకుంది. తన సినిమాలతో కంటే సోషల్ మీడియా పోస్ట్ లతో బాగా ఫేమస్ అవుతున్న దిశా పటాని తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది.దిశా పటాని ప్రముఖ ఇన్నర్ వేర్ కంపెనీ అయిన కాల్విన్ క్లెయిన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే వాటి కోసం పలు ఫొటో షూట్ లు చేసిన దిశా తాజాగా చేసిన ఫొటో షూట్ మరీ రచ్చ. ఇన్నర్ వేర్స్ కనిపించేందుకు షర్ట్ బటన్స్ తీసి వేసి పాయింట్ జిప్ తీసి మరీ ఫొటోలకు ఫోజ్ లు ఇచ్చింది. ఆ ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. దిశా ఆ ఫొటోని ఏకంగా 15 లక్షల మంది లైక్ చేయగా 12 వేల మంది కామెంట్స్ చేశారు.

కొందరు దిశా అందానికి ముగ్దులవుతుంటే మరి కొందరు మాత్రం అమ్మడి తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఎంత ఇన్నర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అయితే మాత్రం మరీ ఇలా బరితెగించి బటన్స్ జిప్ తీసి మరీ వాటిని షో చేయాలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో దిశా ఏమైనా స్పందిస్తుందా చూడాలి. ఇక త్వరలో ఈమె సల్మాన్ ఖాన్ నటించిన 'భారత్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కత్రినా కైఫ్ 'భారత్' లో మొదటి హీరోయిన్ గా నటించగా... దిశా పటాని రెండవ హీరోయిన్ గా నటించింది.