హాఫ్ న్యూడ్ దిశా.. ఏమీ చూపించలేదట

Wed Jan 11 2017 15:00:01 GMT+0530 (IST)

లోఫర్ బ్యూటీ దిశా పటానీ గేర్ మార్చేసిందని ఇప్పటికే చెప్పేసుకున్నాం. జాకీ చాన్ మూవీలో నటిస్తుండడంతో.. తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పావులు కదుపుతున్న ఈ పాప.. ఇప్పుడు దబ్బూ రత్నాని కేలండర్ లో మెరిసింది.

ఈ కేలండర్ కోసం అమ్మడు ఇచ్చిన పోజ్ చూస్తే.. ఏంటీ దిశా పటానీ న్యూడ్ గా తయారైపోయింది అనిపించక మానదు. కాస్త పర్టిక్యులర్ గా కనిపిస్తే.. ఇది న్యూడ్ పోజ్ కాదు.. సెమీ న్యూడ్ అని అర్ధమవుతుంది. అయితే.. అసలు విషయం ఏంటంటే.. ఈ కేలండర్ ఫోటో కోసం దిశా పటానీ కనీసం టాప్ లెస్ పోజులు కూడా ఇవ్వలేదట. అదంతా కెమేరా మాయ అంటోంది ఈ సుందరాంగి.

 'నేను టాప్ లెస్ కాదు.. మీకు ఏమీ కనిపించదు.. కేవలం నా వీపు మీకు దర్శనం అవుతుందంతే. అదే దబ్బూ కాన్సెప్ట్. నేను ఎంచక్కా ఆయన చూపిన రిఫరెన్సుల ప్రకారం ఫాలో అయిపోయాను. నేను మొదటిసారి ఈ కేలండర్ లో కనిపించబోతున్నాను. ఎంత త్వరగా ఈ కేలండర్ స్టాండ్స్ లో కనిపించనుందని ఎదురుచూస్తున్నా' అని చెబుతోంది దిశా పటాని. జాకీ చాన్ తో నటిస్తున్న హిందీ కం చైనీస్ మూవీ కుంగ్ ఫూ యోగ తన లైఫ్ ను మార్చేస్తుందని ఈ అమ్మడి ఆశ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/