ఆ స్కిన్ షో ఆపండి బాబోయ్..

Wed Feb 21 2018 10:58:04 GMT+0530 (IST)

ఫ్యాషన్ వరల్డ్ లో సినిమా హీరోయిన్స్ కొంచెం ఘాటుగా కనిపించినా కూడా హాట్ టాపిక్ అవ్వడం ఈ రోజుల్లో చాలా కామన్. గత కొంత కాలంగా రోజు ఎవరో ఒకరు హాట్ ఫొటో షూట్స్ తో రచ్చ చేయడం చూస్తూనే ఉన్నాం. ఎవరికీ వారు ఏ మాత్రం తగ్గకుండా అందాలను కొత్తంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అప్పుడపుడు వారు ఇచ్చే పోజులు చాలా వరకు కాంట్రవర్షియియల్ అవుతున్నాయి.కొన్ని రోజుల క్రితం హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా క్లివేజ్ షోతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అస్సాం టూరిజం ప్రచారకర్తగా ఉన్న ప్రియాంక క్యాలెండర్ కు ఇచ్చిన ఫొటో షూట్ లో కాస్త క్లివేజ్ షోను ప్రదర్శించింది. అయితే రూపా జ్యోతి అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక చోప్రా ఫొటో షూట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేనా మన సంస్కృతి. అసభ్యకరంగా ఉన్న ఆ క్యాలెండర్ ని చించి పడేయండి అంటూ అప్పట్లో ఆమె పోరాటం బాగానే చేసింది.

అయితే అదే తరహాలో ఇప్పుడు నెటిజన్స్ నుంచి మరో ఇద్దరి హీరోయిన్స్ క్లివేజ్ షోలపై చాలా మండిపడుతున్నారు. దిశా పటాని - నర్గిస్ ఫక్రి పై కూడా తీవ్ర స్థాయిలోనెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా దిశా ఇచ్చిన ఒక క్లివేజ్ పోజ్ పై ఘాటు విమర్శలే వచ్చాయి. మధ్యలో ఆమె బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ ని ఇన్వాల్వ్ చేస్తూ మరి తిట్టారు. ఇక ఫక్రి నార్మల్ గా కనిపిస్తేనే ఒక్కోసారి దారుణంగా ఉంటుంది. అలాంటిది క్లివేజ్ లో చూడలేకున్నాం బాబోయ్ అంటూ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.