ఫొటో స్టోరీ: ఏ దిశ చూసినా అందమే

Mon Apr 16 2018 14:40:48 GMT+0530 (IST)


అందంగా ఉండడమే కాదు.. ఆ అందాన్ని ఎలా కాపాడుకోవాలో... ఎంత అందంగా చూపించాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో.. తాజాగా ఆమె హీరోయిన్ గా నటించిన బాఘీ-2 సినిమాలో తన ఒంపుసొంపులన్నీ ఆరబోస్తూ గ్లామర్ మొత్తం వెండితెరపై గుమ్మరించేసింది. ఇందులో హీరో టైగర్ ష్రాఫ్ ఫైట్లు ఎంతగా మెప్పించాయో.. దిశా అందాలు అంతగా మురిపించాయి.గ్లామర్ డాల్ అంటే ఇలాగే ఉండాలి అనిపించే దిశాకు ప్రస్తుతం అవకాశాలు బాగానే వస్తున్నాయి. వీటిని నిలబెట్టుకోవడానికి దిశ తెగ కష్టపడుతోంది. ఓవైపు జిమ్ లో వర్కవుట్లు అవీ చేస్తూనే మరోవైపు డ్యాన్స్ ప్రాక్టీసులతో ఫిగర్ ను పర్ ఫెక్ట్ గా మెయిన్ టెయిన్ చేస్తోంది. దీంతో ఈ మధ్య యాడ్ కంపెనీలు కూడా దిశా వెంటపడుతున్నాయి. తాజాగా ఓ స్పోర్ట్స్ వేర్ కంపెనీకి దిశా ఇచ్చిన స్టిల్స్ చూస్తే మతిపోవాల్సిందే. స్కిన్ టైట్ డ్రస్ లో ఆమె ఇచ్చిన ఫోజులకు మండుటెండలోనూ చెమటలు పట్టాల్సిందే.

యాక్టింగ్ పరంగా పెద్దగా చెప్పుకోదగ్గ టాలెంట్ లేకపోవడంతో గ్లామర్ నే దిశా బాగా నమ్ముకుంది. ఇప్పటికే టాలీవుడ్ లో ఓ ట్రయిల్ వేసింది. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన హీరోయిన్ గా చేసింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది.  ఇప్పుడు తన ఫిట్ నెస్ అండ్ గ్లామర్ తో బాలీవుడ్ ను ఫిదా చేసే పనిలో పడిపోయింది.