లోఫర్ పాపకు ఆఫర్ కావాలట

Mon Mar 20 2017 22:10:36 GMT+0530 (IST)

మెగా హీరో వరుణ్ తేజ్- పూరీ జగన్నాధ్ ల కాంబినేషన్ లో రూపొందిన లోఫర్ మూవీతో అరంగేట్రం చేసిన  బ్యూటీ దిశా పటానీ. సినిమా పెద్దగా ఆడకపోయినా.. అమ్మడి ట్యాలెంట్ కి బాగానే మార్కులు పడ్డాయి. అవకాశాలు అందే లోపే ఈ భామకు బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో అక్కడికి జంప్ అయిపోయింది.

ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీలో నటనకు మంచి పేరు రావడం.. ఆ వెంటనే జాకీ చాన్ సినిమా కుంగ్ ఫు యోగలో ఆఫర్ రావడంతో.. సౌత్ పై అంతగా దృష్టి పెట్టలేదు. ఇప్పడు కూడా ఒకట్రెండు హిందీ ఆఫర్స్ ఉన్నాయి కానీ.. దిశాకు మాత్రం ఆశించిన బ్రేక్ రావడం లేదు. అందుకే మళ్లీ టాలీవుడ్ పై దృష్టి పెట్టింది ఈ బ్యూటీ. తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తే.. పేరు-డబ్బు రెండూ అందే అవకాశం ఉండడంతో.. టాలీవుడ్ పై మళ్లీ కన్నేసిందట దిశా పటానీ. తెలుగు సినిమా చేయడానికి సిద్ధం అంటూ ఇప్పటికే సిగ్నల్స్ కూడా పంపించేస్తోంది. ఇప్పటివరకూ టాలీవుడ్ నుంచి కొత్త ఆఫర్ అందిందో లేదో మాత్రం చెప్పడం లేదు.

అయితే.. ఈ మధ్య సినిమాల్లో కంటే టైగర్ ష్రాఫ్ తో రొమాన్స్ చేస్తూనే ఎక్కువగా వార్తల్లో నానుతున్న దిశా పటానీ.. మళ్లీ తెలుగు సినిమాలు చేస్తానని అనడంతో.. పలువురు దర్శక నిర్మాతలు ఇప్పటికే ఆమెను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/