తువ్వాలు చుట్టిన టపుటపుటపోరి!

Sat Aug 18 2018 07:09:10 GMT+0530 (IST)

టపు టపు టపోరి.. కన్యా కుమారి! .. అంటూ ఆనాడే మెగాస్టార్ సాంగేసుకున్నారు. విజయశాంతి అందచందాల్ని అలా వర్ణిస్తూ ఆయన దించేసిన ల్యాండ్ మార్క్ స్టెప్పుల్ని ఇప్పటికీ మెగాభిమానులు మర్చిపోలేరు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ టపోరిని చూస్తే - వీరఫ్యాన్స్ అంతా చిరంజీవులుగా మారిపోయి స్నేక్ డ్యాన్స్ ఆడేయడం ఖాయం. ఇంతకీ ఎవరీ టపోరి? .. అంటే పరిచయం చేయాల్సిన పనేలేదు. ఈ అమ్మడు లోఫర్ చిత్రంతో ఆనాడే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిపోయింది. రీసెంటుగానే `భాఘి 2` చిత్రంతో బంపర్ హిట్ కొట్టినప్పుడు టాలీవుడ్ లోనూ దిశా గురించి ఆసక్తికర చర్చ సాగింది.టాలీవుడ్ లో తొలి ఎటెంప్ట్ సక్సెస్ కాకపోయినా బాలీవుడ్ లో మాత్రం క్రేజీగా అవకాశాలు అందుకుంటోంది. అక్కడ హృతిక్ తర్వాత హృతిక్ అంతటోడు .. బోయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ అండదండలతో అదరగొట్టేస్తోంది. `భాఘి 2`తో బంపర్ హిట్ కొట్టాక సల్మాన్ భాయ్ `భరత్` చిత్రంలో అవకాశం అందుకుంది. అటు బాలీవుడ్ లో నటిస్తూనే మరోవైపు ఇరుగుపొరుగు పరిశ్రమలపైనా అమ్మడు కాన్ సన్ ట్రేట్ చేసే ఆలోచనలో ఉందిట. కెరీర్ సంగతి అటుంచితే..

నిన్ననే టైగర్ ష్రాఫ్ తో దిశా డిన్నర్ డేట్ కెళ్లింది. తిరిగి వస్తూ పింక్ బనియన్ తో గుబులు పెంచేసింది. ఇంతలోనే ఎంత మార్పో! ఈరోజు ఇలా వైట్ టాప్ - బ్లూ డెనిమ్ చినిగుల నిక్కరుపై .. తువ్వాలు లాంటి చొక్కా ఒకటి చుట్టుకొచ్చిందిలా. మొత్తానికి కుర్రకారుకు కిక్కెక్కించే ఫార్ములాని పక్కాగా అప్లయ్ చేయడంలో దిశాని కొట్టేవాళ్లే లేరు. ఇంతకీ ఎక్కడికి వెళుతోందో కానీ ముంబై విమానాశ్రయంలో ఇలా ప్రత్యక్షమైంది. ఈ అమ్మడితో పాటుగా రణవీర్ సింగ్ - సోనాల్ చౌహాన్ - సైఫ్ అలాఖాన్ - సోనూ సూద్ - గుర్మీత్ లాంటి టాప్ స్టార్లు ఉన్నారు.