Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: లోఫర్ పిల్ల కిక్కిచ్చింది

By:  Tupaki Desk   |   18 May 2018 6:23 AM GMT
ఫోటో స్టోరి: లోఫర్ పిల్ల కిక్కిచ్చింది
X
2015 లో వచ్చిన లోఫర్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ దిశా పటాని. అమ్మడు ఎంట్రీ ఇవ్వగానే స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు గట్టిగానే ఉన్నాయని అంతా అనుకున్నారు. పైగా సెక్సీ ఫిగర్ కలిసొచ్చే అంశం. కానీ ఆమె బ్యాడ్ లక్ ఏమిటో గాని పెద్దగా స్టార్ హోదాను అందుకోలేకపోయింది. అవకాశాలు కూడా అంతగా ఏమి దక్కలేదు. కానీ అమ్మడు ఇచ్చిన ఫొటో షూట్స్ మాత్రం బలే ట్రెండ్ అయ్యాయి.

గత ఏడాది ఇదే నెలలో అమ్మడు ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన స్టిల్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. హావర్ గ్లాస్ ఫిగర్ తో ఆమె బికినిలో ఇచ్చిన స్టిల్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై వచ్చింది. ఇక ఈ సారి మరో కొత్త తరహా లుక్ లో అమ్మడు అందరికి షాక్ ఇచ్చింది. రీసెంట్ గా ఓ ప్రముఖ మ్యాగజైన్ కి దిశా కాల్విన్ క్లైన్ లో దుస్తుల్లో చాలా హాట్ గా కనిపించింది. దానికి తోడు ఆమె ఇచ్చిన నవ్వు కూడా సెక్సీ గా ఉంది. ప్రస్తుతం ఆ పోటో కూడా సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.

ఇక ఇటీవల అమ్మడు భాగీ సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పరవాలేదు అనిపించే విధంగా సక్సెస్ అయ్యింది. ఇక సల్మాన్ ఖాన్ భరత్ సినిమాలో దిశా అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో అమ్మడు విజయం అందుకుంటే స్టార్ హీరోయిన్ గా సక్సెస్ కొట్టినట్లే. చూడాలి మరి దిశా కెరీర్ ఎలా టర్న్ అవుతుందో..