ఫోటో స్టోరీ : మరోసారి 'బ్రా' బోయ్!

Tue Dec 11 2018 14:27:37 GMT+0530 (IST)

బ్రాండుల యందు సీకే బ్రాండ్ వేరయా విశ్వధాభిరామ వినురవేమ! ఇటీవలి కాలంలో యూత్ లో అంతగా పాపులరైన లోదుస్తుల బ్రాండ్ మరొకటి లేనేలేదు.ఈ పాపులారిటీ క్రెడిట్ ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కెల్విన్ క్లెయిన్ (సీకే) లోదుస్తుల కంపెనీకి ఎనలేని పాపులారిటీ తెచ్చిన టాప్ మోడల్ కం మేటి కథానాయిక దిశా పటానీ గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్రాండ్ వల్ల తనకు ఇమేజ్ పెరిగిందో - లేక తన వల్ల బ్రాండ్ కి ఇమేజ్ పెరిగిందా? అని ప్రశ్నిస్తే.. ఆ బ్రాండ్‌కి దిశా వల్లనే ఎక్కువ ఇమేజ్ పెరిగిందని చెప్పాలి.ఒంపు సొంపుల ఖిల్లా  అథ్లెటిక్ రూపం పెర్ ఫెక్ట్ ఫిట్ అని ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా. ఇప్పటికే సీకే బ్రాండ్ కి ఉవ్వెత్తున ప్రచారం తెచ్చి పెట్టడంలో దిశా పటానీ పెద్ద సక్సెసైంది. ఈ సిరీస్ లో రకరకాల భంగిమలతో ఫోజులిచ్చి అంతకంతకు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు షేర్ చేస్తూ వేడి పెంచుతూనే ఉంది. దిశా ఇలా ఇన్ వోర్ లో దర్శనమివ్వగానే వాటిని యూత్ అంతే వేగంగా ఆన్ లైన్ లో షేర్ చేస్తూ వేడెక్కిస్తున్నారు. ఇంతకంటే బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ని చూడలేం! అన్నట్టే ఉంది వ్యవహారం.

ప్రస్తుతం ఈ భామ సల్మాన్ భాయ్ నటిస్తున్న `భరత్` అనే చిత్రంలో నటిస్తోంది. ఈద్ కానుకగా 7 జూన్ 2019లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇదే చిత్రంలో కత్రిన కైఫ్ కథానాయికగా నటిస్తుంటే దిశా సల్మాన్ కి చెల్లాయిగా కనిపించనుందట. టైగర జిందా హై ఫేమ్ అబ్బాస్ అలీ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. భాఘి 2 ఘనవిజయం తర్వాత టైగర్ ష్రాఫ్ తో మరో సినిమాలో నటించేందుకు దిశా ప్రణాళికల్లో ఉందట.