పుష్పాలకే ఈర్ష్య కలిగించే అందం

Wed Nov 15 2017 00:13:18 GMT+0530 (IST)

ప్రపంచంలో అందమైన పువ్వులు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని మాత్రమే పరిమళిస్తాయి. అలాగే పువ్వుల్లాంటి ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఉన్నా.. వారిలో తమ అందాన్ని పరిమళింపచేసే ముద్దుగుమ్మలు కొంతమందే ఉంటారు. మళ్లీ ఆ అందంలో పలు విధాలు ఉంటాయి. అందులో ఓ మేలిరకం పూబంతి దిశా పటాని.ఈ భామ స్టార్ హీరోలతో సినిమా చేయలేదు కానీ అభిమానులను మాత్రం బాగానే సంపాదించుకొంది. చేసిన కొన్ని సినిమాలు కూడా ఈమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక అమ్మడు రీసెంట్ గా చేసిన ఫొటో షూట్ చూస్తే.. స్కిన్ షోతో అదరగొట్టేసిందని చెప్పవచ్చు. మొన్నటి వరకు ఇదే అందాలతో కనిపించినా కొత్తగా ఉంది అనేలా స్టిల్ ఇచ్చింది దిశా. మాక్సిమ్ కవర్ పేజ్ లో ఉన్న ఆ ఫోటోని చూస్తే హైబ్రిడ్ ఫ్లవర్స్ అయినా ఈర్ష్య పడాల్సిందే. ప్రస్తుతం దిశా పటాని ఫొటో కుర్ర కారు హృదయాలను పట్టు తప్పేలా చేస్తోందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

దిశా పటాని ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ తో భాగీ 2 అనే ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది. అయితే దిశా ఫిట్ నెస్ పై బడా కంపెనీలు మనసు పారేసుకుంటున్నాయి. పుమా లాంటి బడా కంపెనీలకు ఈ బ్యూటీ ప్రచార కర్తగాను వ్యవహరిస్తోంది. ఇక హీరోయిన్ గా తీసుకునేందుకు మరి కొన్ని బడా నిర్మాణ సంస్థలు కూడా చర్చలు నిర్వహిస్తున్నాయి.