ఫోటో స్టోరి: నిజ్జం.. చూపిస్తోంది బూట్లనే

Fri Oct 13 2017 11:47:16 GMT+0530 (IST)

టాలీవుడ్ మూవీ లోఫర్ లో మెరిసిన బ్యూటీ దిశా పాట్నీ రేంజ్.. ఆ తర్వాత తెగ మారిపోయింది. డైరీ మిల్క్ చాక్లెట్స్ తో మొదలుపెట్టి.. ఇప్పుడు జనాలను మైమరిపించే రేంజ్ వరకు వచ్చేసింది ఈ భామ. ఎంఎస్ ధోనీ చిత్రంతో సక్సెస్ సాధించడం.. ఆ వెంటనే జాకీచాన్ మూవీ కుంగ్ ఫూ యోగాలో ఛాన్స్ పట్టేయడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత పెద్ద సినిమాల్లోనే నటించాలని పట్టుపట్టుకు కూర్చున్న ఈ భామ.. మొత్తానికి బాఘీ2లో అవకాశం అయితే దక్కించుకుంది.ఇప్పుడు దిశా పాట్నీ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. గభాలున చూస్తే.. బ్లాక్ బికినీలో భలే పోజ్ ఇచ్చిందే అనుకోవచ్చు. టూపీస్ బికినీని ఇలా డిజైన్ చేశారన్న మాట అనిపించడం ఖాయం. కానీ అలా అనుకుంటే పొరపాటే. ఇది ఓ ట్రాక్ సూట్ అనే సంగతి కాసింత లేటుగా అర్ధమవుతుంది. అయినా.. దిశా పాట్నీ తన సూట్ ను కానీ.. ఫిజిక్ ను కానీ ప్రదర్శించడం లేదు. అసలు ఆమె చూపిస్తున్నది వేరే.

రీసెంట్ గా ఈ భామ పూమా ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. అందుకే పూమా బూట్లను ప్రచారం చేసేందుకు ఇలా స్పెషల్ గా ఫోటో దిగిందన్న మాట. అందుకు తగిన స్పోర్ట్స్ వేర్ ను ధరించిందంతే. షూస్.. స్పోర్ట్స్ వేర్ ప్రచారం తప్ప.. ఈ ఫోటోలో ఇసుమంతైనా వేరే ఉద్దేశ్యం లేదు సుమీ!