Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: లోఫర్ పాప తడి సొగసులు

By:  Tupaki Desk   |   27 Nov 2015 3:30 PM GMT
ఫోటో స్టోరి: లోఫర్ పాప తడి సొగసులు
X
దిశా పటానీ.. టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోన్న మరో మోడల్. వరుణ్ తేజ్ కు జతగా పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో చేస్తున్న లోఫర్ మూవీయే.. ఈమెకు ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ పిక్చర్. అయితే ఈ భామ సినిమాలకు కొత్తేమో కానీ.. గ్లామర్ ఫీల్డ్ కి మాత్రం కాదు. పలు అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్ గా వ్యవహరించిన అనుభవం ఉంది. గార్నియర్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీ యాడ్స్ లో కూడా నటించింది.

అంతే కాదు.. ఈమెకు ముంబైలో మంచి క్రేజ్ ఉంది. దీనికి కారణం ఈ భామ చేసిన ఫోటో షూట్స్. బోల్డ్ గా బోలెడన్ని షూట్స్ చేసి, అందాలను ఆరబోసే ఫోజులిచ్చేయడంలో దిశాపటానీకి మంచి ఎక్స్ పీరియన్సే ఉంది. ఇప్పుడలాంటి సెక్సీ లుక్స్ నే ఓ స్విమ్ వేర్ కోసం ఇచ్చేసింది. తడిసిన సొగసులను ఆరబెట్టకుండా.. చూసే వాళ్ల మనసులన ఎండబెట్టేస్తోంది. బికినీతో అందాలను ఆరబోయడం, అందులో అందంగా కనిపించడం చిన్న విషయమేం కాదు. అసలా డ్రస్ అందరికీ సెట్ కాదు కూడా. కాకపోతే దిశాపటానీకి మాత్రం పర్ఫెక్ట్ బికినీ బాడీ అనే పేరుంది. నిజానికి ఈ బోల్డ్ సుందరి దిశాపటానీ నితిన్ తో కలిసి టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కాకపోతే చివర్లో ఆ ప్రాజెక్ట్ నుంచి ఈ భామను తప్పించారు.

దీంతో ఇప్పుడు వరుణ్ తేజ్ పక్కన ఎంట్రీ ఇస్తోంది. ఈ సుందరికి డ్యాన్సుల్లో కూడా మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. పూరీ మూవీ లోఫర్ లో స్టెప్పుల్లో కూడా తన ట్యాలెంట్ ప్రదర్శించబోతోంది దిశా పటానీ. డ్యాన్సుల విషయంలో సత్తా చాటగలిగితే మాత్రం.. టాలీవుడ్ లో కొందరు స్టార్ హీరోల నుంచి పిలుపు రావడం ఖాయమనే అంచనాలున్నాయి. దీంతోపాటు. లోఫర్ లోనూ తన అందచందాలను బాగానే బైట పెట్టిందట దిశా పటానీ.