Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఓ యాంగిల్లో అప్సరసే

By:  Tupaki Desk   |   22 July 2017 12:15 PM GMT
ఫోటో స్టోరి: ఓ యాంగిల్లో అప్సరసే
X
ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయ్యింది కానీ స్టార్ నటి కాలేకపోతుంది ఓ ముద్దుగుమ్మ. ఎమ్ యెస్ ధోని సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ దిశా పటాని సినిమాలు కన్న ఫోటో షూట్లే ఎక్కువగా చేస్తుంది. ఫ్యాషన్ వాక్లు చేస్తూ టూర్లు వెళ్తూ కొత్త డిజైన్ డ్రెస్లు వేసుకుంటూ.. అబ్బో అభిమానులు గుండెలో గుబులు పుట్టిస్తుంది. ఒకే హీరోయిన్ అందంగా ఉండటం సెక్సీ లుక్ ఉండటం కొంచం అరుదు అనే చెప్పాలి. కానీ దిశా పటానికి కమర్షియల్ హీరోయిన్ అందం డ్రామా క్వీన్ చందం రెండు కలిపి ఉండటంతో సినిమాలేమీ చేయకపోయినా క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది.

ఈ మధ్యనే జరిగిన IIFA అవార్డ్ షోలో తన పరువాలును ప్రదర్శించిన దిశా ఇప్పుడు మళ్ళీ తన పరువాలను ఒడుపుగా దారబోస్తోంది. చిన్న నవ్వుతో పెద్దగా అలంకరణ ఏమి లేకుండానే తన సహజ అందాలతో ముద్దుగా చూస్తుంది దిశా. పింక్ బట్టల్లో తన సోయగం చూసిన ఏ మనిషైనా కూడా ఫ్లాట్ అవ్వాల్సిందే. ఆకర్షించే చక్కదనం మాయ చేసే అందం ఆమె సొంతం ఆనక తప్పదు. అసలు ఇలాంటి కాస్ట్యూమ్స్ లో ఒక లుక్కులో మాత్రం ఏదో అప్సరస తరహాలో ఉంది కదూ.

ధోని సినిమా తరువాత చెప్పుకో తగ్గ సినిమాలు ఏమి చేయలేదు. కాని కొన్ని సినిమాలు ఆఫర్లు వచ్చినా ఆమె అడిగినంత సొమ్మును ఇచ్చుకోలేక తప్పుకున్నారు అని ఒక టాక్. ఇప్పుడు బోయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ నటిస్తున్న బాఘీ2 చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. టైగర్ ష్రాఫ్ , దిశా ప్రేమను ఇప్పుడు బాలీవుడ్ సినీ వర్గాలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అది సంగతి.