Begin typing your search above and press return to search.

దిశా.. దిక్కులు పిక్కటిల్లాల్సిందే

By:  Tupaki Desk   |   22 Jun 2017 5:35 AM GMT
దిశా.. దిక్కులు పిక్కటిల్లాల్సిందే
X
బాలీవుడ్ లో వెలిగిపోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్న దిశా పాట్నీ.. టాలీవుడ్ మూవీ లోఫర్ తో తెరంగేట్రం చేసింది. వరుణ్ తేజ్ కి హీరోయిన్ గా నటించిన ఈ భామ వెంటనే ముంబై ఫ్లైట్ ఎక్కేసింది కానీ.. డ్యాన్సుల విషయంలో దిశా ట్యాలెంట్ ఏంటో ఇక్కడ బాగానే చూపించింది.

లోఫర్ ఆడియో ఫంక్షన్ తో మొదలుపెట్టి.. ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోల వరకూ స్టెప్పుల విషయంలో తన ప్రతిభ ఎలాంటిదో చూపించడంలో.. దిశ పాట్నీ ఎప్పుడూ తడబడలేదు. అటు ఫిట్నెస్ తో పాటు.. ఇటు డ్యాన్స్ పై తనకు ఉన్న మక్కువ కారణంగా.. విపరీతంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేస్తూ ఉంటుంది ఈ భామ. అలా తను ప్రాక్టీస్ చేసే వీడియోలను నెట్ లో పెట్టేసి జనాలకు షాక్ ఇవ్వడం కూడా పరిపాటి. ఇప్పుడు పాప్ స్టార్ బియాన్సే పాడిన 'హే మిసెస్ కార్టర్' పాటకు దిశా పాట్నీ అద్భుతమైన డ్యాన్స్ చేసి చూపించింది. తన డ్యాన్స్ మాస్టర్ తో కలిసి.. మిసెస్ కార్టర్ కు ఈ సుందరాంగి వేసిన చిందులు.. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయాయి.

అత్యంత క్లిష్టమైన స్టెప్స్ ను కూడా అలవోకగా అద్భుతంగా దిశ వేసేస్తున్న తీరు కచ్చితంగా ఆకట్టుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ తో కలిసి బాఘి2లో నటిస్తున్న దిశా పాట్నీ.. అతనితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందనే రూమర్ హల్ చల్ చేస్తోంది.