ఫోటో స్టోరీ: దిశా గుండె ధడేల్

Sun May 26 2019 09:58:52 GMT+0530 (IST)

'లోఫర్` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది దిశా పటానీ. తొలి సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా దిశా గ్లామర్ యాంగిల్ కి తెలుగు యూత్ ఫిదా అయిపోయారు. అయితే ఆ తర్వాత తెలుగులో నటించేందుకు దిశా ఆసక్తి కనబరచ లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ భాయ్ నటించిన భారత్ చిత్రంలో నటించింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. జూన్ 6న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సందర్భంగా టీమ్ ప్రచారంలో బిజీగా ఉంది. ఇటీవలే సల్మాన్- దిశా జోడీ స్లోమోషన్ సాంగ్ యూత్ కి పిచ్చిగా నచ్చేసింది. ఇందులో సల్మాన్ భాయ్ ఓ సర్కస్ వాలాగా.. నావీ అధికారిగా నటిస్తున్నారు. కత్రిన కైఫ్ అతడి సరసన నాయికగా నటిస్తోంది. అయితే ఇందులో దిశా రోల్ ఏంటి? అంటే .. అందుకు తాజాగా సస్పెన్స్ వీడింది.`భారత్` చిత్రంలో సల్మాన్ కి సోదరి పాత్రలో దిశా నటిస్తోందని అప్పట్లో ప్రచారమైంది. అయితే స్లోమోషన్ సాంగ్ చూశాక దిశా పూర్తిగా మాస్ రోల్ పోషిస్తోందని అర్థమైంది. ఫ్యాన్స్ కి అన్నిరకాలుగా సందేహం క్లియరైంది. ఇందులో దిశా ఓ అతిధి పాత్రలో నటిస్తోంది. అది కూడా సర్కస్ లో అథ్లెట్ గా కనిపించబోతోంది. `మీరు చేసింది కేవలం గెస్ట్ రోల్ కదా?` అని దిశాని ప్రశ్నిస్తే సల్మాన్ సార్ సినిమాలో ఒక చిన్న పాత్ర అయినా చేసేస్తాను. అందుకే అతిధి పాత్ర అయినా వెంటనే అంగీకరించేశాను!! అని దిశా చెబుతోంది. అలీ అబ్బాస్ జాఫర్ సర్ ఫోన్ చేసి ఇందులో ఓ స్పెషల్ అప్పియరెన్స్ ఉంది.. చేస్తావా? అని అడిగారు. దానికి ఎంతో సంతోషం కలిగింది. కెరీర్ ఆరంభమే ఇంత పెద్ద సినిమాలో అవకాశం దక్కినందుకు వెంటనే ఓకే చెప్పానని దిశా తెలిపింది.

ఈ సినిమాలో తన లుక్ ని దిశా తాజాగా ఇన్ స్టాలో అభిమానులకు షేర్ చేసింది. ఇందులో డ్యాన్సర్ కం అథ్లెట్ గా దిశా కనిపించబోతోంది. అమ్మడి ఒంపుసొంపుల్ని ఆవిష్కరించేలా ఈ స్పెషల్ సిల్వర్ క్రిస్టల్ డ్రెస్ ని డిజైన్ చేశారు. దిశా ఏమాత్రం మొహమాట పడకుండా నాభి సౌందర్యాన్ని.. ఇతర అందాల్ని ఓపెన్ చేసిందిలా. బాబ్డ్ హెయిర్ కట్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్రైలర్ లోనూ ఇదే రూపాన్ని రివీల్ చేశారు. దిశా అందచందాలు గుండె ధడేల్ మనిపిస్తున్నాయ్. ప్రస్తుతం ఈ ఫోటో యూత్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. తెలుగులోనూ భారత్ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ సంస్థ రిలీజ్ చేస్తోంది.