వీడియో: దిశా గ్రేట్ కిక్ బాక్సర్

Sun Dec 16 2018 22:07:38 GMT+0530 (IST)

పట్టుదల ఉండాలే కానీ సాధ్యం కానిది ఏది? మనిషి తలుచుకుంటే అసలు సాధించలేనిదే లేనేలేదు. కొండమీంచి కోతిని కిందికి దించొచ్చు. ఈ సృష్టిలో అనుకున్నది సాధించుకోగలిగే ఏకైక జీవరాశి మనిషి మాత్రమే. ఈ విషయాన్ని ప్రాక్టికల్‌గా నిరూపిస్తోంది దిశా పటానీ. ఈ భామ అనుకున్నదే తడవుగా ష్రాఫ్ బోయ్‌తో పోటీపడుతూ 6ప్యాక్ యాబ్స్ ని తీర్చి దిద్దింది. మెలి తిరిగిన దేహశిరులతో జీరో సైజ్ రూపంతో దిశా అందరికీ షాకిస్తోంది. దిశాలోని ఈ మేకోవర్ కి టైగర్ ష్రాఫ్ అంతటివాడే షాక్ తిన్నాడు.తాజాగా మరో కొత్త ట్రెండ్‌కి దిశా పటానీ శ్రీకారం చుట్టింది. ఈ అమ్మడు మార్షల్ ఆర్ట్స్ అంతు చూడడమే ధ్యేయంగా ప్రణాళికలు వేసి అందుకు కఠోరంగా శ్రమిస్తుండడం అందరికీ షాకిస్తోంది. ముఖ్యంగా కిక్ బాక్సింగ్ లో దిశా రాటు దేలుతోంది. అందు కోసం నిరంతరం అత్యంత కఠిన నియమాలు పాటిస్తూ ఎంతో ప్రాక్టీస్ చేస్తోంది. ఇప్పటికే 6 అడుగుల ఎత్తు తన పాదాన్ని పైకి ఎత్తి పంచ్ లు విసిరేస్తోంది. భాఘి హీరోకే సాధ్యం కాని ఫీట్స్ తో ముచ్చెమటలు పట్టించేస్తోంది.

అందుకు సంబంధించిన వీడియో ప్రూఫ్ కూడా లభించింది. ఇదిగో ఇలా కిక్ బాక్సింగ్ లో భాగంగా లెగ్ మూవ్ మెంట్ ని ప్రాక్టీస్ చేస్తున్న దిశా వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయిపోతోంది. ఇదే దూకుడు కొనసాగిస్తే మునుముందు జేమ్స్ బాండ్ సినిమాలకు ఆప్షన్ గా మారే ఏకైక బాలీవుడ్ కథానాయికగా దిశా పేరు చరిత్రకెక్కుతుందేమో అనిపిస్తోంది. టామ్ క్రూజ్ అంతటి వాడే మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి ఎంపిక చేసుకుంటే ఆశ్చర్యపోవడానికేం లేదు. ఏంజెలినా జోలీ బదులుగా సాల్ట్ సీక్వెల్లో దిశానే ఎంపిక చేసుకుంటే తప్పేం కాదు. చార్లెస్ యాంజెల్స్ సిరీస్ కి ఇండియన్ వెర్షన్ తీస్తే కచ్ఛితంగా అందులో ఒక ఏంజెల్ గా ఈ అమ్మడిని సెలక్ట్ చేయాల్సిందే.

వీడియో కోసం క్లిక్ చేయండి