ఫోటో స్టోరీ : సీకే బ్రాండ్ కి తాకట్టు

Tue Nov 13 2018 21:36:25 GMT+0530 (IST)

ఒకే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు.. సామాజిక మాధ్యమాల వెల్లువలో హాట్ గాళ్స్ దశ దిశ తిరిగిపోతోంది. ఒక్కో ట్వీట్ కి.. ఒక్కో పోస్టుకి లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు. ఓ రకంగా ట్విట్టర్ - ఇన్ స్టా సెలబ్రిటీలకు - టాప్ మోడల్స్ కి సరికొత్త ఆదాయ మార్గాల్ని తెచ్చి పెడుతున్నాయి. దీని ఫలితం విపరీత ధనార్జనే ధ్యేయంగా కొంతమంది విలువలకు తిలోదకాలిచ్చేస్తున్నారు. అంగాంగంపై నుంచి వలువలు ఒలిచి అర్థనగ్న ఫోటోల్ని.. ఫోటో అప్ లోడింగ్ సైట్ ఇన్ స్టాగ్రమ్ లో పందేరానికి పెడుతున్నారు.కొందరైతే పండుగలు పబ్బాల వేళ టూమచ్‌గా చెలరేగిపోతున్నారు. హద్దులు మీరి ఎక్స్ పోజింగ్ చేయడం ఆ ఫోటోషూట్లను ఇన్ స్టాలో పోస్ట్ చేయడం ద్వారా లక్షల్లో ఫాలోవర్స్ ని సంపాదించుకుని - అటుపై యాడ్ ప్రమోషన్ ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ దిశా పటానీ ప్రస్తుతం ఈ పద్ధతిలోనే ఆర్జనతో చెలరేగిపోతోంది. పండుగలు వస్తే చాలు ఏదో ఒక రూపంలో తాను ప్రమోషన్ చేస్తున్న బ్రాండ్లకు పెద్ద రేంజులో ప్రచారం కల్పించే పని పెట్టుకుంటోంది. దిశా ఇన్ స్టాగ్రమ్ పరిశీలిస్తే ఈ సంగతి ఇట్టే అర్థమైపోతోంది. ఈ భామ ఇన్‌స్టా మొత్తం ప్రస్తుతం కెల్విన్ క్లెయిన్ బ్రా - అండర్ వేర్ కి సంబంధించిన ఫోటోలతో హీటెక్కిస్తోంది. దిశా అందచందాల్ని ఇంచి ఇంచి ఈ సీకే బ్రాండెడ్ ఇన్ వోర్ లో ప్రదర్శించింది. మొన్న దీపావళి రోజున సీకే బ్రాండ్ ఇన్‌వోర్ ధరించి ఫోజివ్వడంతో ఇన్ స్టాలో ట్రోల్స్ ని ఎదుర్కొంది.

అసలే దిశాకి ఇన్ స్టాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఈ ఫోటోల్ని షేర్ చేసిన నిమిషాల్లోనే లక్షలాది మంది వీటిని వీక్షించారు. మొత్తానికి సీకే బ్రాండ్ ఆ రేంజులో ప్రమోటవుతోంది. దిశా మరీ ఇంత ఇదిగా ప్రమోషన్ చేస్తోంది కాబట్టి ఈ బ్రాండ్ కోసం ఎంత పెద్ద డీల్ సెట్ చేసుకుందో.. ఎంత పెద్ద మొత్తం అందుకుందో తెలియాల్సి ఉంది. దిశా ప్రస్తుతం ష్రాఫ్ బోయ్ తో ఎఫైర్ సాగిస్తూ.. సల్మాన్- అబ్బాస్ అలీ `భరత్` అనే చిత్రంలో నటిస్తోంది. ఈ షూటింగ్ సమయంలో బోయ్ ఫ్రెండ్ తో గొడవపడి విడిపోయిందన్న ప్రచారం హోరెత్తిపోతోంది.