Begin typing your search above and press return to search.

డ్రెస్సుపై గులాబీలు.. ప్రచారంలో అందాలు

By:  Tupaki Desk   |   19 March 2018 11:30 PM GMT
డ్రెస్సుపై గులాబీలు.. ప్రచారంలో అందాలు
X
సినిమా మేకింగ్ కంటే ప్రమోటింగ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే రోజులు ఇవి. అందుకు తగినట్లుగానే ఫిలిం మేకర్స్.. యాక్టర్స్ రకరకాలు ప్రమోషన్స్ చేస్తున్నారు. భాష ఏదైనా ఈ ప్రచారం మాత్రం ఇప్పుడు సినిమాలకు చాలా కీలకం. ఇంక గ్లామర్ డాల్స్ గా టాప్ రేంజ్ కు చేరుకోవాలని భావించే అందాల భామలు.. అదే రూట్ లో ప్రచారం చేస్తూ ఉంటారు.

టాలీవుడ్ మూవీ క్షణంను బాలీవుడ్ లో బాఘీ2 అంటూ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. టైగర్ ష్రాఫ్ హీరోగా.. దిశా పటానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ.. మార్చ్ 30న విడుదల కానుంది. ఇప్పుడీ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దిశా పటానీ కూడా తన వంతుగా ఇందుకు అందాల సాయం బాగానే చేస్తోంది. రీసెంట్ డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్ లేటెస్ట్ సీజన్ కు.. టైగర్ తో కలిసి అటెండ్ అయింది. వైట్ బార్డాట్ టాప్ ధరించిన ఈ బ్యూటీ.. షార్ట్ డ్రెస్ తో అలరించింది. దుస్తులపై కనిపిస్తున్న సెల్ఫ్ ప్రింట్ ఎర్రని గులాబీలు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.

మూవీలో అందాలను పంచడం ఒక ఎత్తయితే.. ప్రచారంలోనే ఈ స్థాయిలో మెరిపించడం మరో కీలకమైన విషయం. మోనోక్రోమ్స్ స్కర్ట్ లో అమ్మడి అందాలు టాప్ రేంజ్ లో మెరిసిపోయాయి. టైగర్ ష్రాఫ్.. దిశా పటానీల మధ్య ప్రేమ వ్యవహారం పీక్స్ లో ఉందనే ప్రచారం ఉంది కానీ.. దీనికి అవునని కాదని ఎటూ సమాధానం చెప్పలేదు ఈ జంట.