Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: దిశా కాల్విన్ పటాని

By:  Tupaki Desk   |   13 Oct 2019 12:26 PM GMT
ఫోటో స్టోరీ: దిశా కాల్విన్ పటాని
X
మోసగాళ్ళకు మోసగాడు టైపులో బాలీవుడ్ లో 'హాటు భామలకు హాటు భామ' అనే టాగ్ ఇవ్వాలంటే మాత్రం అది తప్పనిసరిగా దిశా పటానికే దక్కుతుంది. అసలు దిశ పేరులో ఒక చిత్రం ఉంది. మన తెలుగువారు కొందరు పటాని అంటారు మరికొందరు పతాని అంటారు.. కానీ అసలు పేరును 'దిశా పాట్ని' అని పలకాలి. తన ఇన్స్టా ఖాతాలో లోనే ఆ విషయం స్పెసిఫిక్ గా రాసి ఉంటుంది. అయితే ఇప్పుడు పాట్ని అంటే అదేదో హైదరాబాద్ ప్యాట్నీ సెంటర్ అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి అంత రిస్క్ చేయాల్సిన పని లేదు.

ఇక డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. దిశాకు కాల్విన్ క్లెయిన్ కు ఎంత విడదీయరాని అనుబంధమో అందరికీ తెలుసు. ఆ ఇన్నర్ వేర్లు కనుక దరించకపోతే దిశాకు పొద్దుగడవదు. అవి చూడకపోతే నెటిజన్లకు కూడా ముద్దదిగదు.. ఏదో వెలితిగా ఉంటుంది. అందుకే దిశా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఓ కొత్త బికిని పోస్ట్ పెట్టింది. ఈ ఫోటోలకు 'మై కాల్విన్స్.. సికే50" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలో రెడ్ కలర్ కాల్విన్స్ తో టాప్ లేపుతోంది. ఆ ఫ్లాట్ యాబ్స్.. ఆ సెక్సీ కర్వ్స్ చూస్తే ఎవరికైనా జివ్వనిపించడం ఖాయం. అసలు పాతకాలంలో ఖజురహో శిల్పాలు చెక్కే సమయంలో అప్పటి జక్కన్నలు ఎవరిని మోడల్స్ గా పెట్టుకున్నారో ఏంటో కానీ ఇప్పుడు మరో ఖజురహో కట్టాల్సి వస్తే మాత్రం ఆ మోడల్స్ లో ఒకరిగా దిశాను ఎంచుకోకతప్పదని చెప్పకతప్పదు. కొత్త ఖజురహోకు జనాల మనోభావాలు దెబ్బతింటాఏమోనని అనుమానం రావచ్చు. అలాంటివారిని బలూచిస్తాన్ పంపిస్తే సరి.

ఈ ఫోటోలకు నెటిజన్ల స్పందన అదిరిపోయింది. పోస్ట్ చేసిన ఇదు గంటల్లోనే ఫోటోలకు 1.45 మిలియన్స్ కు పైగా లైక్స్ వచ్చాయి.. ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు.. "దీపావళిని ముందే తెచ్చిన దిశా".. "దిశా కాల్విన్ పటాని".. "హాటెస్ట్ కాల్విన్ క్లెయిన్" అంటూ రెచ్చిపోయారు. దిశా సినిమాల విషయనికి వస్తే ప్రస్తుతం 'మలంగ్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో హీరో ఆదిత్య రాయ్ కపూర్. అనిల్ కపూర్.. కునాల్ ఖేము ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.