ఫోటో స్టొరీ: ఫైనల్ గా గౌన్ వేసుకున్న పతాని

Thu May 23 2019 15:47:47 GMT+0530 (IST)

దిశా పతాని అనగానే అందరూ ఇన్నర్ వేర్ బ్రాండ్ల పాపగా చూడడం మొదలు పెట్టారు.  ఎవరినైనా దిశా పతాని నటించిన సినిమా పేర్లు చెప్పమంటే చెప్పలేక గుడ్లు తేలేస్తారు  కానీ.. దిశా ఏ ఇన్నర్ వేర్ బ్రాండుకు ప్రమోషన్ చేస్తుంది అని అడిగితే మాత్రం కళ్ళు మూసుకొని చిటికెలో చెప్పేస్తారు. ఎవరికైనా సినిమాల ద్వారా పాపులారిటీ వస్తుంది.. దాంతో కార్పోరేట్స్ బ్రాండ్ అంబాజిడర్ గా నియమించుకుంటాయి. కానీ ఇక్కడ కథే వేరు.. ఇన్నర్ వేర్ బ్రాండ్ అంబాజిడర్ గా మారిన తర్వాతే దిశా క్రేజ్ డబల్ ట్రిపుల్ అయింది!అందుకే అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు దిశా ఇన్నర్ వేర్ ఫోటో షూట్లు చేస్తుందా.. ఎప్పుడెప్పుడు ఆ అందాలను కళ్ళతో జుర్రుకుందామా అని అదేపనిగా ఎదురుచూస్తుంటారు.  కానీ ఎప్పుడూ ఇన్నర్లు.. బికినీలు వేసుకొని బోర్ కొట్టిందేమో కానీ తాజాగా ఒక అందమైన గౌన్ వేసుకొని ఫోటో షూట్ లో పాల్గొంది.  ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.  ఇక ఆ  ఫోటో షూట్ చేసే సమయంలో స్టైల్ గా అలా తిరిగి తన జుట్టును ఫ్లిప్ చేసింది.  ఫోటోలతో పాటు ఆ వీడియోను కూడా తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ 'స్లో మోషన్ మే' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఎందుకో అర్థం అయింది కదా. సల్మాన్ ఖాన్ 'భారత్' సినిమాలో 'స్లో మోషన్ మే' అనే సూపర్ హిట్ సాంగ్ ఉంది. దాన్ని గుర్తు చేసిందన్నమాట.

ఏమాటకామాటే చెప్పుకోవాలి. దిశా వేసుకున్న ఆరెంజ్.. బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ లో ఎంతో అందంగా ఉంది. తీగలు..పూలు.. ఆకులతో పాటుగా డ్రెస్ కు అక్కడక్కడ వేలాడే తాళ్ళు డిఫరెంట్ గా ఉన్నాయి. స్లీవ్ లెస్ గౌన్ కావడం తో దిశా అందాలను టీజర్ పోస్టర్ కు రిలీజ్ చేసే ప్రీ లుక్ లాగా చూపించింది. ఈ గెటప్ లో ఒక స్పెషల్ మేకప్ కూడా ఉందండోయ్. కళ్ళకు పింక్ కలర్ మేకప్ వేసుకుంది.  అది కూడా అందంగానే ఉంది.  అందుకే ఈ అందాలకు ఫిదా అయిన నెటిజనులు 20 గంటలలోపే 1.2 మిలియన్ లైక్స్ కొట్టారు. కామెంట్లకైతే లెక్కే లేదు. రెచ్చిపోయారు.