అటు తిరిగి ఇటు తిరిగి.. ఆ పిల్లే సంఘమిత్ర

Sat Oct 21 2017 18:51:25 GMT+0530 (IST)


అదేంటో తెలియదు కాని.. అసలు శృతి హాసన్ లీడ్ రోల్ చేయనంటూ వదిలేసినప్పటి నుండి ''సంఘమిత్ర'' సినిమా గురించి చాలా రూమర్లే వచ్చాయి. అయితే వాటన్నింటినీ ఎప్పటికప్పుడు దర్శకుడు సి.సుందర్.. ఆయన భార్య - మాజీ హీరోయిన్ ఖుష్బూ వాటిని ఖండిస్తూనే ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాపై ఒక క్లారిటీ ఇచ్చారులే.కోలీవుడ్ బాహుబలిగా అభివర్ణించబడుతున్న ఈ సంఘమిత్ర సినిమాలో.. శృతి హాసన్ ఒక వీర వనిత - యోధురాలు పాత్రలో కనిపిస్తే.. ఆర్య మరియు జయం రవి ఇతర ముఖ్యమైన పాత్రలు చేయాల్సి ఉంది. అయితే ఆ ఇద్దరు హీరోలు అలాగే ఉన్నా కూడా.. కత్తియుద్దంలో ట్రైనింగ్ పొందాక కూడా శృతి ఈ ప్రాజెక్టు నుండి పక్కకు తప్పుకుంది. అయితే అలా జరిగిన ఆర్నెల్లకు ఇప్పుడు సంఘమిత్ర పాత్ర కోసం రూమర్లలో బాగా నానిన ఒక పేరునే ప్రకటించారు మేకర్లు. లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటానీని ఈ పాత్రకు ఎంచుకున్నారు.

అటు తిరిగి ఇటు తిరిగి దిశాను తీసుకున్నారు బాగానే ఉంది కాని.. ఆమెకు సరిగ్గా నటించడమే రాదు కేవలం గ్లామర్ ఆరబోయడం తప్పించి.. ఆమె ఎలా ఇంతటి భారీ బడ్జెట్ సినిమాకు న్యాయం చేస్తుంది అని ప్రశ్నిస్తున్నారు సినిమా అభిమానులు. చూడాలి మరి ఈ మేకర్లు దిశాతో ఎలా కన్విన్సింగ్ గా సినిమాను రూపొందిస్తారో!!