Begin typing your search above and press return to search.

అందాలతో 'దిశా' నిర్దేశం

By:  Tupaki Desk   |   16 July 2017 9:24 AM GMT
అందాలతో దిశా నిర్దేశం
X
లోఫర్ భామ దిశా పటానీకి.. ధోనీ మూవీతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మధ్య కాలంలో అమ్మడి అంచనాలు.. తనపై తాను పెట్టుకున్న నమ్మకాలు బాగా ఎక్కువైపోయాయనే టాక్ కూడా ఉంది. భారీ ప్రాజెక్టులలో అవకాశాలతో ఈ భామ దగ్గరకు ఫిలిం మేకర్స్ వెళుతుంటే.. అంతకంటే భారీ డిమాండ్స్ తో వారిని బెదరగొట్టేస్తోందనే టాక్ కూడా ఉంది.

చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా.. ఈ భామ టార్గెట్ ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోవడమే. అవకాశాలు అందిపుచ్చుకుంటూ మెల్లమెల్లగా తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకుని.. టాప్ రేంజ్ కి వెళ్లాలనే ఆలోచన ఈమెకు ఏ మాత్రం లేదు. అందుకే.. తాను టాప్ రేంజ్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తానని తెగేసి చెబుతోంది. ఈ ఆఫర్ తో పాటు భారీగా ముట్టచెప్పాల్సిందే అన్నది రెండో కండిషన్.

మోకాళ్లకు బోలెడంత పై వరకూ కనిపించేలా.. మెడ నుంచి వీలైనంత కింద వరకూ ఎక్స్ పోజ్ చేసేలా.. నడుం భాగం అంతా.. ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లోంచి కనిపించేలా.. ఈ వయ్యారి వేసుకున్న వలువలు.. ఎవరికీ విలువలను గుర్తు చేసుకోనివ్వలేదు. సినిమాల విషయంలో సెలక్టివ్ గా ఉన్నా.. ఎప్పటికప్పుడు తనను తాను హాట్ గా ప్రొజెక్ట్ చేసుకోవడంలో.. దిశా పటానీ చాలామందికి దిశా నిర్దేశం చేస్తోంది.

టాప్ స్టార్స్ పక్కన నటించే రేంజ్ కి.. ఇంకా ఈ వయ్యారి వచ్చిందో లేదో తెలియదు కానీ.. ఆ స్థాయిలోనే రెచ్చిపోతోంది. తాజాగా ఐఫా అవార్డ్ ఫంక్షన్ జరగగా.. గ్రీన్ కార్పెట్ పై ఈ బ్యూటీ మెరిసిన తీరు.. ప్రతీ ఒక్కరికీ షాక్ ఇచ్చేసింది.