Begin typing your search above and press return to search.

ప్రభాస్ పక్కన సూటవుతుందా?

By:  Tupaki Desk   |   16 Aug 2017 7:43 AM GMT
ప్రభాస్ పక్కన సూటవుతుందా?
X
‘సాహో’ సినిమాలో ప్రభాస్ పక్కన నటించే హీరోయిన్ ఎవరా అని కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. కత్రినా కైఫ్ అని.. దీపికా పదుకొనే అని.. ఇంకా ఏవేవో బాలీవుడ్ భామల పేర్లు వినిపించాయి. ఇక దక్షిణాదిన కొందరు స్టార్ హీరోయిన్ల పేర్లూ ప్రచారంలోకి వచ్చాయి. చివరికి హిందీ పరిశ్రమ నుంచే శ్రద్ధా కపూర్ ను ఫైనలైజ్ చేశారు. ఐతే ఈ అమ్మాయి విషయంలో జనాల నుంచి సానుకూల స్పందన అయితే రావడం లేదు. ప్రభాస్ పక్కన శ్రద్ధా కపూర్ అంటే హిందీ ప్రేక్షకులకు ఎలా అనిపిస్తోందో ఏమో కానీ.. మన జనాలకు మాత్రం ఈ అమ్మాయి పేరు రుచించట్లేదు.

ప్రభాస్ ఆరడుగులకు పైగా ఎత్తుండే ఆజానుబాహుడు. చాలా మ్యాన్లీగా ఉంటాడు. అతడి పక్కన హీరోయిన్ అంటే కొంచెం హైట్ ఉండాలి. కాస్త కండపట్టి ఉండాలి. అతడి పక్కన అనుష్క.. కాజల్ లాంటి హీరోయిన్లు బాగా సూటవుతారు. కానీ శ్రద్ధా కపూర్ లో అలాంటి లక్షణాలేమీ కనిపించవు. ఈ అమ్మాయి పొట్టిగా ఉంటుంది. మరీ సన్నగా కూడా ఉంటుంది. ఈమెకు అందగత్తెగా ఎప్పుడూ అంత పేరు రాలేదు. తొలి సినిమా ‘ఆషికి-2’ సూపర్ హిట్టవడం వల్ల శ్రద్ధాకు ఓ మోస్తరుగా అవకాశాలైతే వచ్చాయి కానీ.. ఆమె ఎప్పుడూ కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించలేదు. పెద్ద హీరోల సరసన నటించలేదు. ఇలాంటమ్మాయిని ఏరి కోరి భారీ పారితోషకం ఇచ్చి ‘సాహో’కు హీరోయిన్ గా తీసుకోవడం పట్ల వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రభాస్ పక్కన ఈ అమ్మాయి సూటవ్వదంటూ పెదవి విరిచేస్తున్నారు జనాలు. ‘సాహో’ యాక్షన్ సినిమా కాబట్టి ప్రభాస్ చాలా మ్యాన్లీగా.. స్టైలిష్ గా కనిపిస్తాడనంలో సందేహం లేదు. అలాంటి సినిమాలో శ్రద్ధా అతడికి ఏమాత్రం ఆనుతుందో అన్నది డౌట్. మరి సుజీత్ ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి.