Begin typing your search above and press return to search.

చైతు-సమంత మధ్య చిచ్చు పెట్టకండే

By:  Tupaki Desk   |   30 Aug 2016 5:30 PM GMT
చైతు-సమంత మధ్య చిచ్చు పెట్టకండే
X
మీడియా మరీ ఎక్కువయిపోవడం సంగతేమో కానీ.. కోడిగుడ్డుకి ఈకలు పీకే బ్యాచ్ ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. ఎవరైనా ఏదైనా కామెంట్ చేయడం ఆలస్యం.. ఎలా వివాదం చేయాలా అనే కాన్సెప్ట్ తప్ప.. దాని వల్ల జరిగే అనర్ధాలను అపార్ధాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు సమంత చేసిన ఓ కామెంట్ ను అడ్డం పెట్టుకుని.. ఆమె కాబోయే భర్తగా ప్రచారం జరుగుతున్న చైతుతో వ్యవహారం బెడిసికొట్టే రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు.

ప్రస్తుతం జనతా గ్యారేజ్ కి ప్రమోషన్స్ చేస్తున్న ఓ కామెంట్ ని సీరియస్ గా కాకపోయినా సిన్సియర్ గా చేసింది. 'ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో బృందావనంలో ఛాన్స్ అనగానే చాలా కంగారు వేసేసింది. అప్పటికి నేను తెలుగులో చేసింది ఏ మాయ చేశావే ఒక్కటే. అదెక్కడో చెన్నైలో షూటింగ్ జరిగింది. అది కూడా చిన్న హీరోతో' అనేసింది సమంత. ఇదీ శామ్స్ చేసిన కామెంట్. దీన్ని అడ్డం పెట్టుకుని.. చైతుని చిన్న హీరో అన్న సమంత అంటూ చాలామంది ఇష్టం వచ్చినట్లు రాతలు మొదలు పెట్టేశారు.

ఏం మాయ చేశావే 2010లో రిలీజ్ అయింది. అది చైతుకి కేవలం రెండో సినిమా మాత్రమే. మొదటి సినిమా జోష్ ఫెయిల్యూర్ తర్వాత ఈ చిత్రాన్ని చేశాడు నాగచైతన్య. దాదాపుగా ఏ మాయ చేశావే చిత్రంతోనే చైతు-శామ్ ల కెరీర్ కి అడుగులు పడ్డాయి. ఇద్దరూ కొత్తోళ్లే అన్నపాయింట్ గుర్తుంచుకోవాలి. అలాంటప్పుడు చైతన్య చిన్న హీరో కాక.. పెద్ద హీరో ఎలా అవుతాడన్నదే అసలు విషయం. అసలు సంగతి తెలియని.. తెలుసుకోని వాళ్లంతా.. చైతుని అవమానించిందంటూ రిలేషన్ మధ్య చిచ్చు పుట్టే పనులు మొదలెట్టేశారు. ఎప్పుడూ అవే రాతలు.. కోతలు..వివాదాలు.. కాస్త ఆలోచించండి బాబులూ..