ఎన్టీఆర్ లుక్.. ఈసారి అచ్చొస్తుందా?

Fri May 19 2017 17:49:04 GMT+0530 (IST)

ఇక ఎన్టీఆర్ బర్తడే సంద్భంగా ''జై లవ కుశ'' సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫారిన్ మేకప్ ఆర్టిస్టుతో పనిచేస్తున్నారు కాబట్టి.. ఏదైన విలక్షణ లుక్ ను రిలీజ్ చేస్తారని అనుకుంటే.. కేవలం ఎన్టీఆర్ ను సంకెళ్ళు వేసి తీసుకెళ్తున్న జమిందార్ తరహాలో చూపించాడు దర్శకుడు బాబీ. ఈ లుక్ చూసి ఫ్యాన్స్ అందరూ రాయల్ లుక్ అంటూ ఆనందపడుతున్నారు కాని.. ఒక బ్యాడ్ సెంటిమెంట్ మాత్రం కాస్త భయపెడుతోంది.

గతంలో ఇలా మీసాలు తిప్పిన లుక్కులో కొన్ని ఘనమైన సినిమాల్లో కనిపించాడు. అవే ఆంధ్రావాలా.. శక్తి.. దమ్ము. ఈ మూడు సినిమాలూ ఎన్టీఆర్ కెరియర్ లో  డిజాష్టర్ కా బాప్స్ అని చెప్పాలి. ఆ సినిమాల్లో మనోడు మీసాలు తిప్పేసి.. సేమ్ టు సేమ్ ఇదే విధంగా కనిపిస్తాడు. ఇప్పుడు ఆ సినిమాలన్నీ ఫ్లాపులే అయిన దృష్ట్యా.. ఇక్కడ ఎన్టీఆర్ ను ఇలా చూస్తుంటే ఫ్యాన్స్ కు కాస్త భయంగా ఉంది. ఈసారైనా సదరు కోర మీసాల లుక్ అచ్చొస్తుందా అంటూ ఆడియన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో లుక్ మార్చిన తరువాతనే ఎన్టీఆర్ పెద్ద హిట్లు కొట్టాడు. సిక్స్ ప్యాక్ చేశాక టెంపర్.. హెయిర్ స్టయిల్ మార్చాక నాన్నకు ప్రేమతో .. బాడీ లాంగ్వేజ్ మార్చాక జనతా గ్యారేజ్ సినిమాలు ఫుల్ కిక్కిచ్చాయి. మరి జై లవ కుశ సినిమాలో ఈ ఫ్లాప్ లుక్ ఉన్నప్పటకి.. ఫారిన్ మేకప్ ఆర్టిస్టు సాయంతో కొత్త లుక్ ఒకటి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి.. ఆ లుక్ కారణంగా పాజిటివ్ సెంటిమెంట్ వచ్చే ఛాన్సుందిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/