Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్ లో ఉంది బాలయ్యా? ఎన్టీఆరా?

By:  Tupaki Desk   |   18 Jan 2018 7:29 AM GMT
ఫస్ట్ లుక్ లో ఉంది బాలయ్యా? ఎన్టీఆరా?
X
నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రంపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ముందుగా చెప్పినట్లుగానే ఎన్టీఆర్ బయోపిక్ కు ఫస్ట్ లుక్ కూడా లాంఛ్ చేశారు. ఆ పెద్దాయన సిగ్నేచర్ చేసే రైటింగ్ స్టైల్ లోనే ఎన్.టి.ఆర్. అంటూ లెటరింగ్.. వెనకాల ఇంగ్లీష్ అక్షరాలతో డిజైన్ చేశారు.

ఈ పోస్టర్ లో చైతన్యరథంపై ఎన్టీఆర్ వస్తుంటే.. ప్రజలు సాదరంగా ఆహ్వానం పలుకుతున్న తీరు కనిపిస్తుంది. అంతవరకూ ఓకే అయినా.. ఇంతకీ ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అన్నదే పజిల్ లా మారిపోయింది. గభాలున చూస్తే ఈ పోస్టర్ లో ఉన్నది ఎన్టీఆరే అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఎన్టీఆర్ ప్రజా యాత్ర చేస్తున్నప్పటి ఓ పాత ఫోటోను ఇలా ఫస్ట్ లుక్ మాదిరిగా ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. అలాగే ఆహార్యం కూడా అచ్చు గుద్దినట్లుగా ఆయనే అనే అభిప్రాయం కలుగుతోంది.

కానీ పెద్దాయన జీవితంపై బయోపిక్ తెరకెక్కిస్తున్నపుడు.. అందులో ఆయన కుమారుడు బాలకృష్ణనే హీరో కం ప్రొడ్యూసర్ అయినపుడు.. అందుకు తగ్గట్లుగానే తన గెటప్ ను మార్చుకుని ఉంటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పైగా ఈ ఫస్ట్ లుక్ కోసం కొంత షూటింగ్ చేసిన సంగతి కూడా గుర్తు చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ చిత్రం కోసం బాలయ్య దాదాపు 62 గెటప్ లలో కనిపిస్తారనే సంగతి గుర్తు చేసుకుంటే.. ఇక్కడ బాలయ్యనే ఇలా అచ్చుగుద్దినట్లుగా ఎన్టీఆర్ కు మేకప్ వేశారని అర్ధం చేసుకోవచ్చు.