అల్లుడిని ఆయన చేతిలో పెట్టిన మహేష్

Mon Apr 16 2018 13:58:32 GMT+0530 (IST)

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ సినిమాను సక్సెస్ రూట్‌లోకి ఎక్కించడం మీదే పూర్తి దృష్టి పెట్టాడు. మరో నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రిగా థియేటర్లలోకి వచ్చేందుకు రెఢీ అవుతున్నాడు. కాగా మహేష్ బావ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు తెగ ఆరాటపడుతున్నాడు. అల్లుడిని లాంఛ్ చేసే బాధ్యత సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజుకి ఇచ్చాడట మహేష్.దిల్ రాజు కథల ఎంపిక గానీ పక్కాగా ఉంటాడనే విషయం తెలిసిందే. అందుకే దిల్ రాజు బ్యానర్లో ఒక సినిమా వస్తోందంటే... సాధారణంగానే మంచి అంచనాలు ఏర్పడతాయి. అందుకే చాలా మంది దర్శకులు కూడా ఆయన బ్యానర్లో సినిమాలు తెరకెక్కించాలని ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన దగ్గర చాలా స్క్రిప్టులే సిద్ధంగా ఉన్నాయని టాక్. మహేష్ బావ సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ సినిమా తెరకెక్కించిన కృష్ణారెడ్డి అశోక్ గల్లా మొదటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అశోక్ గల్లా సరసన నటించే హీరోయిన్ తో పాటు మిగిలిన నటీనటులను త్వరలో ఎంపిక చేసి ప్రకటించనున్నారు.

హీరో అయ్యేందుకు అశోక్ గల్లా గత ఏడాది నుంచే ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. దిల్ రాజు సినిమాల స్టైల్ లోనే రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రూపొందే ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు బెక్కం వేణుగోపాల్ చూసుకుంటారు. మరి సూపర్ స్టార్ అల్లుడు ఏ రేంజ్ లో ఇరగదీస్తాడో చూడాలంటే... కొన్ని రోజులు ఆగాల్సిందే!