Begin typing your search above and press return to search.

ఇప్పుడు సోదంతా చెప్పి వేస్ట్‌ తేజ

By:  Tupaki Desk   |   7 Oct 2015 10:30 AM GMT
ఇప్పుడు సోదంతా చెప్పి వేస్ట్‌ తేజ
X
"హోరా హోరీ" సినిమా ఎందుకు ఫ్లాపయ్యింది? దర్శకుడు తేజ ఈ విషయాలన్నీ చూసుకోవాలిగా మరి. ఒక సినిమా వచ్చి ఆడకపోతే ఎందుకు ఆడలేదు అనే విశ్లేషణ చేసుకోవడం కంపల్సరీ. అలా చెయ్యకపోతే తదుపరి సినిమాలపై ఒక గ్రిప్ ఉండకపోవచ్చు. కాని తేజ చాలాకాలం నుండి ఫ్లాపులే కొడుతున్నాడు. మరి ప్రతీసారి విశ్లేషణ చేసుకోవట్లేదు అంటారా? పదండి ఆయన్నే అడుగుదాం.

''అసలు హోరా హోరీ గురించి మాట్టాడటం వేస్ట్. ఆల్రెడీ సినిమా ఫ్లాపయ్యిందిగా. ఇంకెందుకు దాని మీద డిస్కషన్లు'' అనేస్తున్నాడు తేజ. అలా కాదు సార్.. అసలు ఎందుకు ఫ్లాపయ్యిందో మీకు ఏమైనా క్లారిటి వచ్చిందా మరి అనడిగితే.. ''ఎందుకె తెలియదు నాకు.. తెలుసు.. ఈ సినిమాలో నేను పూర్తి స్థాయి తెలివితేటలు పెట్టలేదు. నువు్వ నేను సినిమాలో చూడండి.. ఫోన్ సీక్వెన్సు కోసం ఎంత బ్రెయిన్ వాడానో.. పోల్ మీద నుండి వైర్ లాగి హీరో ఫోన్ చేస్తాడు.. ఆ నెంబర్ లెక్చరర్ బోర్డు మీద ఏదో వడ్డీ లెక్కకింద రాసి అమ్మాయికి చెబుతాడు.. అంతటి సీన్లు పడుంటేనే.. సూపరాడేదే'' అంటూ చెప్పుకొచా్చడు గురుడు. కాని ఇప్పుడు ఇదంతా చెబుతుంటే వేస్టుగా అనిపించట్లేదా గురూజీ?

నిజానికి నిర్మాత డబ్బులు పెట్టేశాక.. బ్రెయిన్ పెట్టకుండా దర్శకుడు పనిచేశా అని చెప్పడం పెద్ద క్రైమ్.. ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఇక్కడ రిస్క్ అయిపోతోంది నిర్మాతలే కాబట్టి. అలాంటప్పుడు తేజ నెగ్లిజెన్సు గురించి ఏమనాలి అని అడుగుతున్నారు సినిమా విశ్లేషకులు. మామూలుగా పెద్దపెద్ద స్టార్లనూ దర్శకులనూ విశ్లేషించే తేజ.. తనని తాను ఓసారి రివ్యూ చేసుకుంటే బెటర్ అనేది అందరి ఒపీనియన్.