Begin typing your search above and press return to search.

తేజ తెలివి బయపడిందిగా!

By:  Tupaki Desk   |   23 Feb 2019 2:30 PM GMT
తేజ తెలివి బయపడిందిగా!
X
ఎన్టీఆర్ రెండు భాగాల ఫలితాలు వచ్చేసినట్టే. మహానాయకుడు మీద ముందు నుంచి భారీ అంచనాలు లేకపోయినా కథానాయకుడు నష్టాలను కొంతైనా తగ్గిస్తుందేమో అన్న చిన్న ఆశతో బయ్యర్లు స్వంత ఖర్చులతో విడుదల చేసుకున్నారు. కాని మొదటి రోజు వసూళ్లు పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. దీనికి కనీసం టిడిపి మద్దతుదారులు బాలయ్య ఫ్యాన్స్ సపోర్ట్ కూడా లేదని ఇవాల్టి నుంచే తగ్గిన కలెక్షన్లు చెబుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు తేజ మరో సారి టాపిక్ గా మారాడు.

తొలుత బయోపిక్ కు తేజకు దర్శకుడుగా తీసుకుని ఒకే భాగంగా ప్లాన్ చేసుకున్న సంగతి గుర్తే. అట్టహాసంగా జరిగిన ముహూర్తం షాట్ ని అతిరధ మహారధుల మధ్య తేజనే షూట్ చేసాడు. తర్వాత ఇంత భారాన్ని తాను మోయలేనని తేజ ఏదో మొక్కుబడి కారణం చెప్పి పక్కకు తప్పుకున్నాడు. ఎక్కడో మణికర్ణిక షూటింగ్ లో ఉన్న క్రిష్ ను ఆఘమేఘాల మీద తీసుకొచ్చి ఎన్టీఆర్ ని ఆయన చేతుల్లో పెట్టేసారు

నిజానికి తేజ వాస్తవాలను దాచి పెట్టి ఎన్టీఆర్ ను స్తుతించే కోణంలో చూపాలన్న డిమాండ్ కు తలొగ్గకపోవడం వల్లే యూనిట్ తో భేదాభిప్రాయాలు వచ్చాయని అవి బయటికి చెప్పుకుంటే బాగుండదని తేజ సింపుల్ గా ఏదో కారణం చెప్పాడని ఆ టైం లోనే ఫిలిం నగర్ టాక్ బయటికి వచ్చింది. ఇప్పుడు రిజల్ట్ చూసాక అది నిజమనించే అవకాశం లేకపోలేదు. క్రిష్ దర్శకత్వంలో మరీ ఎంచదగ్గ లోపాలు లేకపోయినా అసలు తేడా స్క్రిప్ట్ లో ఉంది.

ఒకే యాంగిల్ లో ఎన్టీఆర్ కథను చెప్పాలని చూసిన ప్రయత్నం బసవతారకం గారి పాత్రను అవసరానికి మించి హై లైట్ చేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే తీర్పును వసూళ్ళ రూపంలో చెప్పేసారు. కథానాయకుడుకి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. మహానాయకుడుకి అంత భాగ్యం కూడా దక్కలేదు. ఈ లెక్కన తేజ అదృష్టవంతుడని కొందరు తెలివైనవాడని కొందరు ఎవరికి వారు తేజను గుర్తు చేసుకుంటున్నారు