Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌కుడు క్రియేటివ్ ప్రమోష‌న్ అదిరిందిగా..

By:  Tupaki Desk   |   26 July 2017 4:02 PM GMT
ద‌ర్శ‌కుడు క్రియేటివ్ ప్రమోష‌న్ అదిరిందిగా..
X
ఈ రోజుల్లో ప్ర‌మోష‌న్ విష‌యంలో రొటీన్ గా ఆలోచిస్తే లాభం లేదు. ఎంతో కొంత క్రియేటివిటీ చూపిస్తే త‌ప్ప జ‌నాల దృష్టిని ఆక‌ర్షించ‌డం క‌ష్టం. అందుకే ద‌ర్శ‌క నిర్మాత‌లు కొత్త కొత్త ఎత్తుగ‌డ‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ త‌రంలో క్రియేటివ్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందిన సుకుమార్ త‌న ప్రొడ‌క్ష‌న్లో తెర‌కెక్కిన ద‌ర్శ‌కుడు సినిమాను మొద‌ట్నుంచి విభిన్నంగానే ప్ర‌మోట్ చేస్తున్నాడు. త‌న‌తో ప‌ని చేసిన న‌టీన‌టుల్ని.. త‌న‌కు ప‌రిచ‌య‌మున్న సాంకేతిక నిపుణుల సాయంతో సినిమాకు ప్ర‌చారం క‌ల్పిస్తున్నాడు. తాజాగా ‘ద‌ర్శ‌కుడు టీం ఒక విభిన్న‌మైన ప్రోమోతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది.

ద‌ర్శ‌కుడు ట్రైల‌ర్ చూస్తే అందులో హీరో హీరోయిన్ ట్రైన్లో వెళ్తుంటే.. ‘‘సినిమాల్లేకుండా ఎంట‌ర్టైన్మెంట్ లేదు.. ఎగ్జైట్మెంట్ లేదు’’ అంటూ ఒక డైలాగ్ చెబుతాడు హీరో. దానికి బ‌దులుగా ‘‘హీరో ఒక్క‌డే వంద మందిని కొట్ట‌డం.. హీరో హీరోయిన్ ప‌ల్లెటూరిలో ప్రేమించుకుని ఫారిన్లో సాంగేసుకోవ‌డం.. మోస్ట్ అన్ నేచుర‌ల్’’ అంటుంది హీరోయిన్. ఐతే సినిమాలంటే ఇలాంటి అస‌హ‌జ‌మైన దృశ్యాలే కాదు.. రియ‌ల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్ స్పైర్ అయిన సన్నివేశాలు కూడా ఉంటాయ‌ని చెప్పే ప్ర‌య‌త్నంలో భాగంగా యువ ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ‌ను తీసుకొచ్చింది ‘ద‌ర్శ‌కుడు’ టీం. త‌న ‘దోచేయ్’ సినిమాలో హీరోయిన్ సిగ‌రెట్ తాగే సీన్ కు త‌న నిజ జీవిత సంఘ‌ట‌నే స్ఫూర్తి అని.. త‌న ఫ్రెండ్ ఒక‌మ్మాయి అలాగే సిగ‌రెట్ తాగేద‌ని.. ఐతే సిగ‌రెట్లు మాత్రం త‌ను తెచ్చుకునేది కాద‌ని చెప్పాడు సుధీర్. మున్ముందు ఇలా ఒక్కో ద‌ర్శ‌కుడితో త‌న రియ‌ల్ లైఫ్ ఇన్సిడెంట్ల‌ను సినిమాల‌కు ఎలా వాడుకున్న‌ది చూపిస్తూ ప్రోమోలు క‌ట్ చేస్తుందేమో ‘ద‌ర్శ‌కుడు’ టీం.