Begin typing your search above and press return to search.

లోకల్ పాప మీద మనస్సుపడ్డాడే!!

By:  Tupaki Desk   |   27 Sep 2016 5:48 PM GMT
లోకల్ పాప మీద మనస్సుపడ్డాడే!!
X
పక్కా లోకల్ సాంగుతో ఒక రేంజులో అభిమాన గణాన్ని సంపాదించేసింది కాజల్ అగర్వాల్. ఒకవేళ గతంలో ఈ అమ్మడి అభిమానులు ఎవరైనా కూడా ఈమె రిటైర్మెంట్ స్టేజీకి చేరిపోయిందిలే అంటూ ఈమెకు దూరంగా వెళిపోయినా.. వారందరూ ఇప్పుడు మరోసారి ఈమె హాట్నెస్ ను చూసి లొట్టలేస్తున్నారు. ఇక కొందరు దర్శకులైతే ఏకంగా ఆమెతో సినిమాలు చేసి తీరతాం అంటున్నారు.

తాను ఎప్పటినుండో కాజల్ ఫ్యాన్ అని.. ఎప్పటికైనా సరే ఆమెతో ఒక సినిమా చేసి తీరుతా అంటున్నాడు మారుతి. మనోడు ఎప్పటినుండో కాజల్ వీరాభిమానట. అందుకే ఎప్పటికైనా ఒక సినిమా ఆమెతో చేస్తాను.. వీలైతే తదుపరి సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకుంటానని చెబుతున్నాడు. బాబు బంగారం సినిమా తరువాత మనోడు రవితేజతో సినిమా చేసుంటే కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవడం ఈజీయేకాని.. ఇప్పుడు అఖిల్ లేదా నాని అంటున్నాడు కాబట్టి కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవడం అంటే కాస్త కష్టమేనేమో. అయితే మారుతి చక్కగా ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తే మాత్రం.. చక్కగా కాజల్ తో చేయాలన్న కోరిక తీరిపోతుంది.

ఇకపోతే కాజల్ కెరియర్ దాదాపు అయిపోతుంది అనుకున్న క్షణంలో అమ్మడ్ని సర్దార్ అండ్ బ్రహ్మోత్సవం సినిమాలు సేవ్ చేయకపోయినా కూడా.. జనతా గ్యారేజ్ ఐటెం నెంబర్ భారీ లిఫ్టే ఇచ్చింది. ఇప్పుడు ఖైదీ నెం 150తో ఇక మారుతి వంటి అభిమానులను ఎంతమందిని పడేస్తుందో చూడాలి.