Begin typing your search above and press return to search.

బెంజి కార్ ఇస్తే బావుణ్ణు - మారుతి

By:  Tupaki Desk   |   7 Oct 2015 6:06 PM GMT
బెంజి కార్ ఇస్తే బావుణ్ణు - మారుతి
X
కొర‌టాల‌కు ఆడి కార్‌, మారుతికి బెంజి కార్ అంటూ అప్ప‌ట్లో ప్ర‌చార‌మైన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌మంతుడు బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌డం తో కొర‌టాల ట్యాలెంటును మెచ్చుకుంటూ మ‌హేష్ ఆడి ల‌గ్జ‌రీ కార్‌ని గిఫ్టు గా ఇచ్చాడు. అలాగే భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంతో బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చినందుకు మారుతికి కూడా అల్లు అర‌వింద్ బెంజి కార్ గిఫ్ట్ గా ఇచ్చారంటూ ప్ర‌చారం సాగింది. అయితే ఇదే విష‌యాన్ని మారుతినే ప్ర‌శ్నిస్తే ఏమ‌న్నాడో తెలుసా?

బెంజి కారు ఇస్తే బావుణ్ణు.. చాలా బావుండేదే అంటూ తేలిగ్గా న‌వ్వేశాడు. ఇంకా నేను అంత ఎద‌గ‌లేదు.. అని అన్నాడు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ నా కెరీర్‌లో మ‌రిచిపోలేని సినిమా. ఈ విజయాన్ని ఆస్వాధిస్తూనే ఈసారి పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుపుకుంటున్నా.. అని మారుతి అన్నాడు. కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతున్నా.. నెమ్మ‌దిగానే కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటున్నా. స్టార్ హీరోల‌తో వెంట‌నే సినిమాలు చేసేయాల‌ని కూడా అనుకోవ‌డం లేదు. అయితే ఇప్ప‌టికి నన్ను అందరూ న‌మ్ముతున్నారు. పెద్ద హీరోలు అవ‌కాశాలిస్తున్నార‌ని అన్నాడు.

న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల్లో బెంజి కార్‌ని కానుక‌గా అందుకునే అర్హ‌త మారుతికి ఉంది. అత‌డి కెరీర్ గ్రాఫ్‌ని ప‌రిశీలిస్తే అత‌డి ని న‌మ్మి పెట్టుబ‌డులు పెట్టిన ఏ నిర్మాత న‌ష్ట‌పోలేదు. అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాల‌న్నీ బ్లాక్‌ బ‌స్ట‌ర్లే. ప్రొడ‌క్ష‌న్ వైజ్ కొంద‌రు కొత్త ద‌ర్శ‌కుల‌కు ఛాన్సులిచ్చిన‌ప్పుడే ఫెయిల్యూర్స్ ఎదుర‌య్యాయి. ఆ సంగ‌తిని మారుతినే స్వ‌యంగా ఒప్పుకుంటున్నారు కూడా. భ‌విష్యత్‌లో శ్రీ‌మంతుడు స్థాయి సినిమాని తీసి త‌న నిర్మాత‌ల నుంచే బెంజి అందుకుంటాడేమో చూడాలి.