Begin typing your search above and press return to search.

​ఈ సినిమాలో అందరూ హీరోలే

By:  Tupaki Desk   |   16 Aug 2017 6:04 AM GMT
​ఈ సినిమాలో అందరూ హీరోలే
X
మన తెలుగులో హారర్ సినిమాలు రావడం కొంచం తక్కువే అనే చెప్పాలి వచ్చిన ఆ కొద్ది సినిమాలు కూడా కామిడీ టచ్ ఉండే కథలుతో ఉంటాయి. రెండు మూడు ఏళ్ళు కిందట వచ్చిన కోనా వెంకట్ ప్రొడ్యూస్ చేసిన గీతాంజిలి కానీ మారుతీ ప్రేమ కథ చిత్రం కానీ అలా కామిడీ హారర్ సినిమాలుగా వచ్చి విజయం పొందినివే. అయితే ఈ రెండు సినిమాలలో దెయ్యం వలన మనుషులు బయపడతారు. కానీ ఇప్పుడు మహి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఆనందో బ్రహ్మ లో మనుషులు దెయ్యాన్ని భయపెడతాయి. ఈ సినిమా కథతో పాటు ఈ సినిమాలో పాత్రలు కూడా అంతే కొత్తగా ఉన్నాయి అని చెబుతున్నారు ఆనందో బ్రహ్మ డైరెక్టర్ ఆ సినిమాలో నలుగురు హీరోలులాంటి పాత్రలు.

ఆనందో బ్రహ్మ సినిమా ఈ 18 న విడుదల అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం సినిమా డైరెక్టర్ మహి రాఘవ్ తో పాటుగా ఈ సినిమాలో ముఖ్యపాత్రలైన వెన్నెల కిశోర్ - శ్రీనివాస్ రెడ్డి - జబర్దస్త్ శకలక శంకర్ - ఇంకా తాగుబోతు రమేశ్ కలిసి ఈ సినిమాలో హీరో అనేది చెప్పారు. వీళ్ళు మాట్లాడుకోవడం చూస్తే ఈ నాలుగురుకి కొన్ని శారీరక మానసిక అంగవైకల్యం ఉన్నట్లు తెలుస్తుంది. వెన్నెల కిశోర్ ఏమో చెవుడు పైగా రేచీకటి - శకలక శంకర్ కు కొంచెం పిచ్చి వాడు గా, అలాగే శ్రీనివాస్ రెడ్డికి ఒక మానసిక సమస్య ఉన్నట్లు డైరెక్టర్ చెబుతున్నాడు. అయితే ఈ నలుగురు కలిసి ఒక ఇంటిలోకి వెళ్ళి ఉండవలిసివస్తే ఆ ఇంటిలో ఉన్న దెయ్యం నుండి ఎలా బయటపడ్డారు అనేది సినిమా కథ గా అనిపిస్తుంది. ఈ సినిమాకు హీరో ఎవరు అనే ప్రశ్నకు డైరెక్టర్ మహి రాఘవ్ చెబుతూ “ఈ సినిమాలో పాత్రలు అన్నీ నా దృష్టిలో హీరోలే. ఒక కష్టం వస్తే దాన్ని ఎదుర్కొని గెలిచిన ప్రతివాడు హీరోనే అని చెప్పాడు. అలా చెబుతూ ఈ కథకు వెన్నెల కిశోరే హీరో లేకపోతే వేరొకరు హీరో అని నేను చెప్పలేను. పాండవులలో ఎవరు హీరో అంటే ఏమని చెబుతాం యుద్దం చేయడానికి ఐదుగురు కావాలి కదా అలానే నా సినిమాకు మీ నలుగురు” అని చెప్పాడు.

బహుశా ఈ సినిమాలో తాప్సీ పన్ను దెయ్యం అయి ఉండవచ్చు. వెన్నెల కిశోర్ - శ్రీనివాస్ రెడ్డి - శకలక శంకర్ - తాగుబోతు రమేశ్ - రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలలో నటించిన హారర్ కామిడీ సినిమా ఆగష్టు 18 నాడు విడుదలవుతుంది.