Begin typing your search above and press return to search.

మొదట 4 గంటలు అనుకున్నారట..!

By:  Tupaki Desk   |   10 Dec 2018 5:40 AM GMT
మొదట 4 గంటలు అనుకున్నారట..!
X
ఈమద్య కాలంలో సినిమా నిడివి అనేది సినిమా సక్సెస్‌ ను డిసైడ్‌ చేసే అంశం అయ్యిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాలు కాస్త అటు ఇటుగా రెండు గంటలు మాత్రమే ఉండేలా తెలివైన ఫిల్మ్‌ మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇక స్టార్‌ హీరోల సినిమాలు కూడా రెండున్నర గంటలకు కాస్త అటు ఇటుగానే ఉంటున్నాయి. ఏదో ఒకటి రెండు సినిమాలు మాత్రమే రెండున్న గంటలు దాటి మూడు గంటల వరకు వెళ్తున్నాయి. సినిమాపై చాలా నమ్మకం ఉన్న వారు మాత్రమే మూడు గంటల సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ ను మొదట మూడు కాదు ఏకంగా నాలుగు గంటలకు కాస్త అటు ఇటుగా ప్లాన్‌ చేశారట.

దర్శకుడు క్రిష్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ చేసే సమయంలోనే ఈ సినిమా నిడివి ఎక్కువ వస్తుందని భావించాడట. స్క్రిప్ట్‌ వర్క్‌ అంతా అయిన తర్వాత సినిమా నాలుగు గంటలుగా చిత్రీకరించి విడుదల చేయాలని భావించారట. అందుకోసం రెండు ఇంటర్వెల్‌ లు ఇవ్వాలని కూడా భావించారట. తాజాగా ఈ విషయాన్ని క్రిష్‌ చెప్పుకొచ్చాడు. అయితే సినిమాలో ఎంత మంచి కంటెంట్‌ ఉన్నా కూడా ప్రేక్షకులను నాలుగు గంటలు కూర్చోబెట్టడం సాధ్యం కాదని భావించారు. వచ్చిన వారిని కూర్చోబెట్టడం సంగతి పక్కన పెడితే నాలుగు గంటల సినిమా అనగానే ప్రేక్షకులు వామ్మో అంటూ వెనక్కు వెళ్లే అవకాశం ఉంది. అందుకే క్రిష్‌ ఈ చిత్రాన్ని రెండు పార్ట్‌ లుగా విడదీయాలని భావించాం అంటూ చెప్పుకొచ్చాడు.

రెండు బాగాలు చేయడం వల్ల అనుకున్న విషయాలను పూర్తిగా చూపించే అవకాశం ఉంది. దాంతో పాటు వ్యాపారం పరంగంగా కూడా భారీగా లాభాలు వస్తాయని చిత్ర యూనిట్‌ సభ్యులు భావించినట్లుగా ఉన్నారు. వచ్చే నెలలో రెండు పార్ట్‌ లు వచ్చే అవకాశం ఉందన్నారు. కాని ఎన్టీఆర్‌ మహానాయకుడు విడుదల అనుమానమే అంటూ చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్‌ పై ఉన్న అభిమానంతో తెలుగు ప్రేక్షకులు ఈ రెండు పార్ట్‌ లకు కూడా బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు.