Begin typing your search above and press return to search.

కోడి రామకృష్ణ కన్నుమూత : తుపాకి సంతాపం

By:  Tupaki Desk   |   22 Feb 2019 9:56 AM GMT
కోడి రామకృష్ణ కన్నుమూత : తుపాకి సంతాపం
X
ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు కోడి రామకృష్ణ చనిపోయినట్లుగా సమాచారం అందుతోంది. కొన్నాళ్ల క్రితం పెరాలసిస్‌ తో బాధపడ్డ దర్శకుడు ఆ కొన్నాళ్లకు కోలుకున్నారు. ఈమద్య మళ్లీ ఆయన ఆరోగ్యం విషమించడంతో గచ్చిబౌలీలోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌ లో జాయిన్‌ చేసినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. రెండు మూడు రోజులుగా వెంటిలేటర్‌ పై కోడి రామకృష్ణను ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కోడి రామకృష్ణ త్వరలోనే కోలుకుంటారని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో షాకింగ్‌ వార్త వినాల్సి వచ్చింది.

తెలుగు సినిమాకు గ్రాఫిక్స్‌ ను పరిచయం చేసింది కోడి రామకృష్ణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 'దేవిపుత్రుడు', 'అమ్మోరు', 'అంజి', 'అరుంథతి' చిత్రాలను అప్పట్లోనే ఫుల్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ తో తెరకెక్కించిన ఘనత కోడి రామకృష్ణ గారికి దక్కుతుంది. ఎన్నో సందేశాత్మక చిత్రాలు తీయడంతో పాటు, పలు దేవతా చిత్రాలను తెరకెక్కించారు. అప్పట్లోనే విజువల్‌ ఎఫెక్ట్స్‌ చిత్రాలను అందించిన కోడి రామకృష్ణ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు.

అంజి చిత్రం కోసం ఆయన సుదీర్ఘ కాలం పాటు కష్టపడ్డారు. ఆ సినిమా విజువల్‌ ఎఫెక్ట్‌ కోసం కఠోరంగా శ్రమించారు. ఆ సినిమా పాజిటివ్‌ ఫలితం ఇవ్వక పోయినా కూడా అంజి చిత్రం విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా నిలిచి పోతుందని చెప్పుకోవచ్చు. ఇక అమ్మోరు మరియు అరుంధతి చిత్రాలు అద్బుతాలుగా చెప్పుకోవచ్చు. సముద్రంలో మునిగిన ద్వారక గురించి ప్రేక్షకులకు తెలియజేసేందుకు వెంకటేష్‌ తో కలిసి కోడి రామకృష్ణ చేసిన 'దేవిపుత్రుడు' మూవీ ఒక అద్బుతంగా నిలిచిపోయింది. ఇలాంటి ఎన్నో చిత్రాలను అందించిన కోడి రామకృష్ణ గారు మరణించడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు.

కోడి రామకృష్ణ గారి మృతికి తుపాకి టీం సంతాపం తెలియజేస్తుంది.