Begin typing your search above and press return to search.

బాహుబలి ఫంక్షన్లో అతనికేం పని??

By:  Tupaki Desk   |   28 March 2017 7:48 AM GMT
బాహుబలి ఫంక్షన్లో అతనికేం పని??
X
బాహుబలి 2 ప్రి-రిలీజ్ ఈవెంటుకు దాదాపు సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లు.. నటించిన నటీనటులు.. సినిమాతో ఏదో విధంగా అసోసియేట్ అయినవారు మాత్రమే వచ్చారు. కేవలం కృష్ణంరాజు.. నాని తప్పిస్తే.. అసలు ఈవెంటుకు బయటవారు ఎవ్వరూ రాలేదు. కాని ఒక యంగ్ డైరక్టర్ తన భార్యతో సహా అక్కడికి విచ్చేశాడు. అతడి ప్రెజన్స్ ఇప్పుడు ప్రకంపనాలు సృష్టిస్తోంది.

తమిళంలో దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి.. రాజా రాణి అనే రొమాంటిక్ కామెడీతో అదరగొట్టేశాడు అట్లీ. మనోడు ఇప్పుడు తన భార్య ప్రియతో కలసి బాహుబలి 2 ప్రీరిలీజ్ ఈవెంట్ కు విచ్చేశాడు. ఈ మధ్యనే విజయ్ తో తెరి సినిమాను తీసి సూపర్ హిట్ కొట్టిన అట్లీ.. ఆ తరువాత విజయ్ తో మరో సినిమాను చేస్తున్నట్లు చెప్పాడు. అయితే ఇప్పుడు సడన్ బాహుబలి క్యాంప్ లో కనిపించడంతో.. ఇప్పుడు మనోడు ప్రభాస్ తో తన తదుపరి సినిమా చేయబోతున్నాడే టాక్ వినిపిస్తోంది. లేకపోతే అక్కడికి ఎందుకు వస్తాడు అంటున్నారు సన్నిహితులు.

ఇప్పటికే బాహుబలి తరువాత సుజిత్ డైరక్షన్లో ఒక యాక్షన్ ఎంటర్టయినర్ చేస్తున్నాడు ప్రభాస్. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలైంది కూడా. ఈ సినిమా తరువాత బహుశా అట్లీ డైరక్షన్లో తెలుగు-తమిళ్ బైలింగువల్ చేస్తాడేమో చూడాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/