Begin typing your search above and press return to search.

సెన్సేషన్ క్రీయేట్ చేయాలనుకుంటున్న దర్శకుడు!

By:  Tupaki Desk   |   24 Feb 2018 10:02 AM GMT
సెన్సేషన్ క్రీయేట్ చేయాలనుకుంటున్న దర్శకుడు!
X
సంచలనాలకు వేదికగా మారడానికి ఆన్ లైన్ కంటే బెస్ట్ మీడియా మరొకటి లేదు అని చెప్పడానికి సెలెబ్రిటీలు వాడుకుంటున్న తీరుని చూస్తూనే ఉన్నాం. వర్మ మొదలు కొని ప్రతి ఒక్కరు దీనిలో భాగస్తులే.తాజాగా దర్శకుడు రవి కుమార్ చౌదరి ఈ మధ్య కాలంలో ఏ దర్శకుడు మాట్లాడని విధంగా ఒక వెబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో ఫైర్ అవ్వడం చూస్తే వర్మను మించిపోయాడే అనిపించడం ఖాయం. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి ఫస్ట్ సినిమా యజ్ఞంతో సూపర్ హిట్ కొట్టిన చౌదరి ఆ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్ళి అందుకోలేకపోయాడు. సాయి ధరం తేజ్ తో చేసిన పిల్లా నువ్వు లేని జీవితం మంచి విజయమే సాధించినా మిగిలినవి మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

ఇక ఆ ఇంటర్వ్యూ ప్రోమోలోనే చాలా ఆరోగంట్ గా కనిపించిన రవి కుమార్ చౌదరి వర్మను ఓ రేంజ్ లో తిట్టేసాడు. ఇప్పుడు మనం చూస్తున్న వర్మ వేరని, తనకు తెలిసిన వర్మ ఏనాడో చచ్చిపోయాడన్న చౌదరి జిఎస్టిని దారుణంగా తిట్టేసాడు. దూల కొద్ది ట్వీట్లు చేసే వర్మ తనకో కూతురు ఉందనే సంగతి మర్చిపోతే ఎలా అని రివర్స్ లో ప్రశ్నించాడు. కెమెరా లో రికార్డు అవుతుందని తెలిసి కూడా నేరుగా సిగరెట్ తాగుతూ ఇంటర్వ్యూ కొనసాగించడానికి రవి కుమార్ సిద్ధ పడటం చూసి యాంకర్ కు ఓ నిమిషం మైండ్ బ్లాంక్ అయ్యింది. క్యాస్టింగ్ గురించి మాట్లాడుతూ పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళను చెప్పుతో కొడతానని చెబుతూ పక్క పంచుకోవడమే నిజమైతే అలాంటివి ఏమి చేయకుండా మరి వీళ్ళెలా పైకి వచ్చారంటూ స్టార్ హీరోల కూతుళ్ళ పేర్లు నేరుగా ప్రస్తావించడం గమనార్హం.

ఫ్లాష్ బ్యాక్ లో ఒక టీవీ యాంకర్ తో లవ్ ఎఫైర్ ఉందని ఒప్పుకున్న చౌదరి, తన పేరు చెప్పే ధైర్యం తనకుందని మీరు ప్రసారం చేస్తారా అంటూ సవాల్ విసిరాడు. ఇంటర్వ్యూలో భాగంగా పెగ్గు కూడా వేసుకోవడానికి ఆయన సిద్ధ పడటం ఇంకా పెద్ద ట్విస్ట్. కాకపోతే పవన్ కళ్యాణ్ - రజనికాంత్ - బాలయ్య గురించి మాత్రం చాలా సాఫ్ట్ గా మాట్లాడిన చౌదరి ఫుల్ ఇంటర్వ్యూ లో ఇంకెంత రచ్చ చేసాడో అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇతను గత సినిమా గోపీచంద్ సౌఖ్యం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.