Begin typing your search above and press return to search.

షాక్ ఇవ్వనున్న నాగ్ పెయిరింగ్!

By:  Tupaki Desk   |   18 July 2018 4:17 PM GMT
షాక్ ఇవ్వనున్న నాగ్ పెయిరింగ్!
X
ఏంటో ఈ పాడు లోకం.. సినిమా కోసం అరవై ఏళ్ళ హీరో ఇరవై ఏళ్ళ సుందరితో జత కడితే అదేమంత ఇబ్బందిగా అనిపించదు. పైగా అదేదో ఘనకార్యం అయినట్టు డై హార్డ్ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటారు. అదే కనుక హీరో కంటే హీరోయిన్ వయసు కాస్త ఎక్కువైతే అదేదో పెద్ద విచిత్రం అనుకుంటారు. ఇప్పుడు అలాంటిదే మరో సందర్భం వచ్చింది.

అక్కినేని నాగార్జున దాదాపు పదిహేనేళ్ళ తర్వాత ఒక బాలీవుడ్ సినిమాలో నటించేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. బ్రహస్త్ర టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ - ఆలియా భట్ - మౌని రాయ్ లు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. నాగార్జున ఈమధ్యనే 'బ్రహ్మాస్త్ర' టీమ్ తో జాయిన్ అయ్యాడు కూడా. ఈ సినిమా గురించి కొత్తగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా సీనియర్ బాలీవుడ్ నటి - అక్షయ్ కుమార్ అత్తగారు అయిన డింపుల్ కపాడియా నటిస్తోందట. ఇందులో ఏం ప్రత్యేకత ఉంది అంది మీరనుకోవచ్చు గాని.. ఆమె వయసు నాగార్జున కంటే మూడేళ్ళు ఎక్కువ.

ఈ సినిమాలో నాగార్జున పార్వతీ దేవి తండ్రి పాత్రలో కనిపిస్తాడని - డింపుల్ పార్వతి తల్లి పాత్రలో కనిపిస్తుందని సమాచారం. హిందీ సినిమాల గురించి కనీస పరిజ్ఞానం ఉన్నవారికి డింపుల్ కపాడియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 1973 లో రిలీజ్ అయిన హిందీ బ్లాక్ బస్టర్ సినిమా 'బాబీ' లో డింపుల్ రణబీర్ ఫాదర్ అయిన రిషి కపూర్ కి జోడీగా నటించింది. అప్పట్లోనే బికినీలతో కుర్రకారుని ఒక ఊపు ఊపింది. మరో ఇంటరెస్టింగ్ పాయింట్ ఏంటంటే తనకంటే వయసు తక్కువ హీరోలతో జోడీ కట్టడం ఇదేమీ ఆమెకి మొదటి సారి కాదు. హిందీ సూపర్ హిట్ ఫిలిం 'దిల్ చాహతా హై' లో అక్షయ్ ఖన్నా తనకంటే వయసులో పెద్దదైన ఈవిడను ప్రేమిస్తాడు.. కానీ ఆమె ఒప్పుకోదు అనుకోండి.. అది వేరే విషయం. ఇప్పుడేమో మూడేళ్ళు చిన్నవాడయిన మన్మధుడితో జోడీ కడుతోంది!