ప్రైవేట్ విమానాన్ని కొనుక్కున్న యంగ్ హీరో

Fri Apr 21 2017 22:16:35 GMT+0530 (IST)

యువ హీరో దిల్‌జిత్ దోసాన్జ్ తన అభిమానులకు తీపి కబురు అందించాడు. `ఉడ్తా పంజాబ్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన దిల్‌జిత్ దోసాన్జ్ వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు. ఇటీవల అనుష్క శర్మ తెరకెక్కించిన ‘ఫిల్హౌరి’ సినిమాలోనూ దిల్ జిత్ నటన పలువురిని ఆకట్టుకుంది. తాజాగా తన అభిమానులకు చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే... ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయడం. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు దిల్ జేత్ షేర్ చేశారు.

త్వరలోనే తన టీమ్ తో కలిసి ప్రపంచమంతటా సంగీత కచేరిలు (కాన్సర్ట్స్) దిల్ జిత్ నిర్వహించబోతున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొనుగోలు చేశాడా లేక వ్యక్తిగత ఆసక్తితోనా అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు కానీ...తన కొత్త విమానంతో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ ‘ ప్రైవేటు జెట్ తో సరికొత్త ఆరంభం మొదలైంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. దీంతో కొత్త విమానం ఫొటోలు - వీడియోలు ట్విట్టర్ లో హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు ఆయన టూర్‌లో వాంకోవర్ - ఎడ్మంటన్ - విన్నిపెగ్ - టోరంటోలో అతను ప్రదర్శనలు ఇవ్వనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/