Begin typing your search above and press return to search.

దీలిప్ భలే సెట్ చేసుకున్నాడుగా!!

By:  Tupaki Desk   |   20 Oct 2017 3:30 PM GMT
దీలిప్ భలే సెట్ చేసుకున్నాడుగా!!
X
దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ మలయాళీ నటి లైంగిక కేసు వివాదం రెండు నెలల పాటు ఎన్నో మలుపులు తీరిగింది. ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయిన హీరో దీలిప్ దాదాపు 60 రోజులు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. నాలుగు సార్లు బెయిల్ కోరగా నిరాకరించిన కేరళ హై కోర్టు అయిదవ సారి షరతులతో కూడిన బెయిల్ ను అక్టోబర్ 3న మంజూరు చేసింది.

కేరళలో స్టార్ హీరోగా ఎదిగిన దీలిప్ దాదాపు రెండు నెలల పాటు జైల్లో సాధారణ వ్యక్తిగా బ్రతికాడు. దీలిప్ ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయినపుడు కొంత మంది ప్రముఖులు అతనికి మద్దతుగా నిలిచారు. అయితే మరికొంత మంది అభిమానులు అతనిపై తీవ్ర స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే ఫైనల్ గా దీలిప్ బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యాడు. అప్పుడు అతనికి మద్దతుగా నిలిచిన అభిమానులు సినీ ప్రముఖులు వచ్చి కలిశారు. అయితే దీలిప్ ఇప్పటివరకు మీడియాతో మాట్లాడలేదు. కొన్ని రోజుల వరకు సైలెంట్ గా ఉన్న ఈ హీరో తొందరగానే రికవర్ అయ్యాడు. తన గత వైభవాన్ని యధావిధిగా గడుపుతున్నాడు.

కేరళ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ చీఫ్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (FEUOK) మనోడ్ని చీఫ్‌ పదవి నుండి తీసేసింది. ఇప్పుడు బయటకు వచ్చాక బాధ్యతలను తీసుకోమని వారే వెంటపడుతున్నారు. రీసెంట్ గా దీలిప్ తన ఇష్టదైవం అయ్యప్ప ను దర్శించుకోవడానికి శబరిమల వెళ్లాడు. అక్కడ అభిమానులతో కొన్ని పోటోలను కూడా దిగాడు. ఇక గతంలో షూటింగ్ మొదలు పెట్టి ఆపేసిన చిత్రాలను కూడా దీలిప్ మొదలుపెట్టారు. మొత్తానికి బయటకొచ్చాక అంతా బాగానే సెట్ చేసుకున్నట్లున్నాడు.