స్టార్ హీరోపై హత్య ఆరోపణలు

Fri Mar 15 2019 11:00:25 GMT+0530 (IST)

మలయాళ స్టార్ హీరో దిలీప్ గత కొన్నాళ్లుగా రకరకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. హీరోయిన్ కిడ్నాప్ మరియు లైంగిక వేదింపుల కేసులో అరెస్ట్ కూడా అయిన దిలీప్ ఆ తర్వాత మలయాళ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ నుండి తప్పించబడ్డాడు. ఆ సమయంలో కొందరికి లంచాలిచ్చి మళ్లీ అసోషియేషన్ లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నించాడు అంటూ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇక మరో వైపు జర్నలిస్ట్ రత్నకుమార్ గత కొన్ని రోజులుగా దిలీప్ పై సంచలన కథనాలు రాస్తున్నాడు. ఆయన మొదటి భార్య మంజు వారియర్ నుండి విడిపోవడం ఆ తర్వాత హీరోయిన్ కావ్యా మాధవన్ ను పెళ్లి చేసుకోవడం వంటి విషయాలపై ఆసక్తికర అంశాలను బయటకు తీసుకు వస్తున్నాడు.ఈ నేపథ్యంలోనే తనను చంపేందుకు దిలీప్ మరియు ఆయన అభిమానులు కుట్ర పన్నుతున్నారు అంటూ రత్నకుమార్ సంచలన ఆరోపణలు చేశాడు. దిలీప్ జైల్లో ఉన్నప్పటి నుండే నా హత్యకు కుట్రలు జరుగుతున్నాయని నన్ను బెదిరించడం చంపేస్తామంటూ హెచ్చరించడం జరుగుతుందనని రత్నకుమార్ అన్నాడు. అయితే చనిపోతాననే భయం నాకు లేదు ఏదో ఒక రోజు చనిపోవడం ఖాయం. అయితే నేను ఇప్పుడే చనిపోతే మాత్రం నీకు పెద్ద సమస్యలు తప్పవు నీవు మరింతగా ఇబ్బందుల్లో చిక్కుకుంటావు అంటూ దిలీప్ ను రత్నకుమార్ హెచ్చరించాడు.

తనకు వచ్చిన మెసేజ్ లు కాల్స్ అన్ని కూడా రికార్డ్ లతో సహా ఉన్నాయి. నన్ను చంపేందుకు చేసిన ప్రయత్నాలు సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. ఒకవేళ నన్ను చంపితే వెంటనే అవి బయటకు వస్తాయి. అవి బయటకు వస్తే నీ జీవితంలో మరింత పెద్ద తప్పు చేసిన వాడివి అవుతావు అంటూ రత్నకుమార్ హెచ్చరించాడు. మొత్తానికి స్టార్ హీరోగా వెలుగు వెలిగిన దిలీప్ కు ఇప్పుడు జర్నలిస్ట్ రత్నకుమార్ చుక్కలు చూపుతున్నాడు. దిలీప్ వైవాహిక జీవితం మరియు సినీ కెరీర్ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడ్డట్లయ్యింది.