Begin typing your search above and press return to search.

పవన్‌ కోసం రాజు గారు కొనలేదే

By:  Tupaki Desk   |   5 Aug 2015 4:07 AM GMT
పవన్‌ కోసం రాజు గారు కొనలేదే
X
రూమర్‌ వాట్సాప్‌ స్టేటస్‌ మెసేజ్‌ అంత లెంగ్త్‌ ఉందనుకోండి.. దానిని మనోళ్ళు ఫేస్‌ బుక్‌ పోస్టంత సైజులోకి ఓ చాంతాడంత పైత్యం యాడ్‌ చేసి మరీ స్ప్రెడ్‌ చేస్తుంటారు. ఓ విధంగా చూస్తుంటే ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా గురించి వస్తున్న న్యూస్‌ కూడా సేమ్‌ టు సేమ్‌ అలాగే అనిపిస్తోంది. అసలు ఈ సినిమా నిజంగా పాజిబిలిటీ ఉందా లేదా అని ఆలోచిస్తుంటే.. ఇప్పుడు అసలు విషయం తేల్చిపాడేశారు దిల్‌ రాజు గారు. పదండి ఓ లుక్కేద్దాం.

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెలుగులో బజరంగీ భాయ్‌ జాన్‌ సినిమాను రీమేక్‌ చేస్తారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అసలు పాకిస్తాన్‌ బ్యాక్‌ డ్రాపు లో తీయాల్సిన ఈ సినిమాను తెలుగు హీరోలు రీమేక్‌ చేస్తే ఏ మాత్రం సెట్టయ్యే ఛాన్సు లేదనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే మనోళ్ళు మాత్రం ఏకంగా దిల్‌ రాజు ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ కొనేశారని, త్వరలోనే సినిమాను పట్టాలెక్కిస్తారని చెప్పేశారు. కాని అందులో నిజం లేదట. అసలు ఈ సినిమాను ఒక్కసారి ధియేటర్‌ లో చూడటమే తప్పించి ఇంతవరకు దానిని రీమేక్‌ చేయాలనే ఆలోచనే రాజు గారికి రాలేదట. అంతేకాదు, అసలు ఈ సినిమాను రీమేక్‌ చేయాలని ఇప్పటికీ అనుకోవట్లేదని కూడా చెప్పుకొచ్చారు. మరి పవన్‌ కళ్యాణ్‌ తో ఆ సినిమా తీస్తుంది ఎవరబ్బా?