Begin typing your search above and press return to search.

యంగ్ హీరోల‌తో నిర్మాత గోవా జంప్‌!!

By:  Tupaki Desk   |   15 Dec 2018 2:48 PM GMT
యంగ్ హీరోల‌తో నిర్మాత గోవా జంప్‌!!
X
అవును .. యువ‌హీరోల్ని వెంటేసుకుని అగ్ర నిర్మాత దిల్ రాజు గోవా జంప్ చేస్తున్నారు. ఇంత‌కీ ఎందుకిలా ఉన్న‌ట్టుండి గోవా సెల‌బ్రేష‌న్.. అంటారా? అయితే డీప్‌ గా వివ‌రాల్లోకి వెళ్లాలి.

దిల్‌ రాజు గోవా వెళుతున్నారంటే అందుకు అర్థం ప‌ర‌మార్థం ఉండ‌కుండా ఉంటుందా? అక్క‌డ ఓ పెద్ద పండుగే ఉంది. అది త‌న అన్న కొడుకు హ‌ర్షిత్ పెళ్లి వేడుక అన్న‌మాట‌. ఈ మ‌హోత్స‌వం గోవాలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంద‌ట‌. ఇప్ప‌టికే ఏర్పాట్లు అన్నీ పూర్త‌య్యాయి. ఈ నెల 21న జ‌ర‌గ‌నున్న ఈ పెళ్లికి త‌మ సంస్థ‌లో న‌టించిన‌ యువ‌హీరోలు - ద‌ర్శ‌కులు అంద‌రికీ గోవా ర‌మ్మ‌ని ఆహ్వానాలు అందాయిట‌. నాని - వ‌రుణ్‌ తేజ్ - సాయిధ‌రమ్ ఈ జాబితాలో ఉన్నార‌ట‌. అలాగే ద‌ర్శ‌కుల్లో వంశీ పైడిప‌ల్లి - హ‌రీష్ శంక‌ర్ - వేణు శ్రీ‌రామ్ లిస్టులో ఉన్నార‌ని తెలిసింది. ఇంకా ఈ జాబితాలో పలువురి పేర్లు ఉన్నా బ‌య‌ట‌కు తెలియాల్సి ఉంది.

గోవాలోని ఎగ్జోటిక్ లొకేష‌న్‌ లో ఈ వెడ్డింగ్ క‌ల‌ర్‌ఫుల్ గా ప్లాన్ చేశార‌ని తెలిసింది. అస‌లే స్టిల్ బ్యాచిల‌ర్ హీరోల‌తో దిల్ రాజు ఈ వేడుక‌ను నిర్వ‌హిస్తున్నారు కాబ‌ట్టి చిలౌట్ ఓ రేంజులో సాగ‌నుంద‌ని తెలుస్తోంది. ఇంత‌కీ హ‌ర్షిత్ పెళ్లాడుతోంది ఎవ‌రినో తెలుసా? సాక్షాత్తూ వైయ‌స్సార్‌ సీపీ అధినేత జ‌గ‌న్ కి ఎంతో స‌న్నిహితుడైన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్ర‌కాష్ రెడ్డి కుమార్తెను అత‌డు పెళ్లాడ‌బోతున్నాడు. ఇప్ప‌టికే నిశ్చితార్థం పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే.