Begin typing your search above and press return to search.

దిల్ రాజుకు వరుస దెబ్బలేంటో!!!

By:  Tupaki Desk   |   9 Feb 2016 5:30 PM GMT
దిల్ రాజుకు వరుస దెబ్బలేంటో!!!
X
దిల్ రాజుకు టాలీవుడ్ లో పర్ ఫెక్ట్ ప్రొడ్యూసర్ అని పేరుంది. ఏకంగా మెగాస్టార్ తో కూడా నాతో ఒక సినిమా తీయవా అని అడిగించుకునేంతంటి పర్ ఫెక్ట్ ప్లానింగ్ ఉన్న నిర్మాతగా గుర్తింపు పొందాడు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి విలువ తేవడం, ఆ బ్యానర్ చూసి సినిమాకు రావచ్చని ప్రేక్షకుల్లో నమ్మకం కలిగించాడంటే.. అందులో దిల్ రాజు కష్టం చాలానే ఉంది. సాధారణంగా ఈయన ఓ మూవీ ప్లాన్ చేస్తే.. అంతా పర్ ఫెక్ట్ సెటప్ అయిపోయినట్లే.

కానీ ఇప్పుడు వరుసగా ఈ ప్రొడ్యూసర్ కి దెబ్బలు తగులుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అప్పుడెప్పుడో రవితేజతో ఎవడో ఒకడు అనే మూవీ అనౌన్స్ చేశాడు దిల్ రాజు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు వాయిదాలు పడుతూ పడుతూ.. చివరకు క్యాన్సిల్ చేసుకునే వరకూ వచ్చింది. అఫ్ కోర్స్ అదే ప్రాజెక్టును నాగ్ తో చేసేందుకు డిసైడ్ అయ్యాడు నిర్మాత. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ తో తీయాలని తలపెట్టిన శతమానం భవతి విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఈ సినిమాని తేజుతో కాకుండా రాజ్ తరుణ్ తీయనున్నాడని ఇఫ్పుడు వార్తలు వస్తున్నాయి. రవితేజతో రెమ్యూనరేషన్ ఇష్యూ అయితే.. ఇక్కడ మెగా మేనల్లుడితో సమస్య ఏంటో కూడా తెలీదు.

ఇక్కడ రెమ్యూనరేషన్ సమస్య వచ్చే పరిస్థితి లేదని అనుకుంటున్నారు. ఇగో ఫీలింగ్సే ఈ ప్రాజెక్టు పట్టాలు మారడానికి కారణంగా చెప్పుకుంటున్నారు. ఒక ప్రాజెక్ట్ అంటే సరిపెట్టుకోవచ్చు.. వరుసగా రెండు ప్రాజెక్టులు గాడి తప్పాయంటే ఆలోచించాల్సిన విషయమే. పర్ ఫెక్ట్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న దిల్‌ రాజు.. ఇప్పుడెందుకు స్టేబుల్‌ గా ప్రాజెక్టులు సెట్ చేసుకోలేకపోతున్నాడో అర్ధం కాని విషయమే?