Begin typing your search above and press return to search.

దిల్‌ రాజు కామెంట్లు అందుకేనేమో!!

By:  Tupaki Desk   |   6 May 2016 1:30 AM GMT
దిల్‌ రాజు కామెంట్లు అందుకేనేమో!!
X
పంచ్‌ మాష్టర్‌ అని నిర్మాత దిల్‌ రాజును ఊరికినే ఎవ్వరూ అనరు మరి. ఆయన ఒక మాటన్నాడంటే.. ఖచ్చితంగా దాని వెనుక చాలా తతంగమే ఉంటుంది. అదిగో మొన్న ''సుప్రీమ్‌'' ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ.. ''దర్శకుడు అనిల్‌ ను రాశి ఖన్నాను ఎందుకు తీసుకున్నావ్‌ అని అడిగాను. అసలే మా బ్యానర్‌ లో హీరోయిన్లు అంత గ్లామరస్‌ గా ఉండరని టాక్‌ ఉంది. కాని మనోడు రాశిని చూపించిన తీరు సూపర్‌. సాంగ్స్‌ చూసి స్టన్నయ్యా'' అన్నాడు. కాని నిజానికి ఈ రివీలేషన్‌ లో దిల్ రాజు ఒక సత్యాన్ని చెప్పాడని ఇప్పుడు సినిమా చూస్తే అనిపిస్తోంది.

ఏ ఒక్క సాంగులో కూడా బెల్లం శ్రీదేవి పాత్ర చేసిన హీరోయిన్‌ రాశి ఖన్నా అసలు గ్లామరస్‌ గానే కనిపించలేదు. పోనివ్‌ స్కిన్‌ షో చేయకపోతే పోయింది.. కనీసం హాట్‌ గా అయినా కనిపించాలిగా.. అబ్బే అలా కూడా లేదు. గతంలో జిల్‌ అండ్‌ శివం సినిమాల్లో చాలా సెక్సీగా కనిపించిన రాశి.. ఈ సినిమాలో కామెడీ సీన్ల కోసం ప్రయత్నించింది కాని.. గ్లామర్‌ పరంగా పెద్దగా ఇంప్రెస్‌ చేయలేదు. అందుకే దిల్‌ రాజు ఆనాడు అలా డిజప్పాయింట్‌ అయ్యి సదరు కామెంట్లు చేశాడేమో అనే సందేహం వచ్చస్తోంది ఎవరికైనా కూడా.

అయితే దర్శకుడు అనిల్‌ పాయింటాఫ్‌ వ్యూ నుండి చూస్తే.. అమ్మాయి వేసింది ఒక పోలీస్‌ ఇన్సపెక్టర్‌ వేషం కాబట్టి.. అంతగా ఎక్సపోజింగ్ బాగోదులే అనుకున్నాడేమో. పైగా ఈ మధ్యన పోలీస్‌ వారి మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. మా లేడీ ఎస్సైలను బ్యాడ్‌ గా చూపించారు అని కంప్లయింట్‌ ఇస్తే అది లేనిపోని తలనొప్పి.