Begin typing your search above and press return to search.

లవర్.. లోగో భలే ఉందండీ!!

By:  Tupaki Desk   |   24 Oct 2017 5:52 AM GMT
లవర్.. లోగో భలే ఉందండీ!!
X
మామూలుగా ఈ మధ్యన ఒక సినిమా మీద ఒపీనియన్ అనేది ఆ సినిమా తాలూకు టైటిల్ డిజైన్ చూస్తేనే వచ్చేస్తోంది. ఎందుకంటే టైటిల్ ఎంత ఆర్డినరీగా ఉంటే కంటెంట్ అంత ఆర్డినరీగా ఉంటుంది అనే సైకాలజీ మన ఆడియన్స్ మెదడులో బలంగా నాటుకుపోయిందనే చెప్పాలి. ఇంతకీ ఇప్పుడు ఈ రాజ్ తరుణ్‌ కొత్త సినిమా లోగో గురించి ఏమంటున్నారో చూద్దాం పదండి.

అలా ఎలా సినిమాతో మంచి దర్శకుడు అనిపించుకున్న అనీష్‌ కృష్ణ ఇప్పుడు తన కొత్త సినిమాతో వస్తున్నాడు. 'లవర్' అంటూ రాజ్ తరుణ్‌ మరియు కొత్తమ్మాయి గాయత్రి సురేష్‌ తో నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను తీస్తున్నాడులే. అయితే లోగోను చూస్తే మాత్రం.. సింపుల్ గా భలే ఉందే అనాల్సిందే. గతంలో చాలా సినిమాలకు ఇలాంటి సింపుల్ టైటిల్ డిజైన్లు చాలా అందాన్ని తెచ్చాయి. ఇప్పుడు కూడా లవర్.. వన్ ఇన్ ఎవ్రీవన్ అంటూ ఈ సినిమా లోగో చాలా బాగుందనే అంటున్నారు చూపరులు.

అసలే ఈ మధ్య వరుసగా తన సినిమాలన్నీ టాక్ తో సంబంధం లేకుండా తనకు మాత్రం మాంచి ప్రాపిట్స్ అందిస్తుండటంతో.. దిల్ రాజు కూడా చాలా ఊపుమీద ఈ సినిమాను మొదలెట్టినట్లున్నారు. పైగా ఈ సినిమాను త్వరత్వరగా పూర్తి చేసి వచ్చే వేలెంటైన్స్ డే నాటికి రిలీజ్ చేస్తారని ఒక టాక్. అది సంగతి.