Begin typing your search above and press return to search.

బాలీవుడ్ మార్కెట్ పై రాజుగారు కన్ను

By:  Tupaki Desk   |   21 Aug 2017 10:09 AM GMT
బాలీవుడ్ మార్కెట్ పై రాజుగారు కన్ను
X
పట్టిందల్లా బంగారమే అనే రీతిన సాగుతోంది ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కెరీర్. నిర్మాతగా దిల్ రాజు ఈ ఏడాది ఇప్పటివరకు పెట్టుబడి పెట్టిన సినిమాలు అన్నీ దాదాపు లాభాలు బాట పట్టాయి. అయితే డిస్ట్రీబ్యూటర్ గా కాస్త లోటు పాట్లు ఉన్నా వాటిని లెక్కలోకి తీసుకునే పరిస్థితిలో ఇప్పుడు దిల్ రాజు లేడనే చెప్పాలి. అయితే ఇంతవరకు బాలీవుడ్ ఊసే ఎత్తని దిల్ రాజు తాజాగా నార్త్ లో కూడా తన సత్తా చూపేందుకు రెడీ అవుతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

నార్త్ లో ఉన్న ఓ బడా నిర్మాణ సంస్థతో కలిసి బాలీవుడ్ సినిమాలు నిర్మించేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడని తెలిసింది. బాలీవుడ్ కి కూడా దిల్ రాజు పక్కా ప్లాన్ తో వెళ్తున్నాడని, లోకల్ తనకు హిట్ ఇచ్చిన కథల్నే హిందీలో రీమేక్ చేసే ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అయితే దిల్ రాజుతో కలవబోతున్న ఆ బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలోనే దిల్ రాజు నుంచి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీజనాలు అంటున్నారు. మరి టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన దిల్ రాజు బాలీవుడ్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.