Begin typing your search above and press return to search.

దిల్ రాజుకు సంక్రాంతి మిక్స్డ్ రిజల్ట్ తెచ్చిందే!

By:  Tupaki Desk   |   15 Jan 2019 1:30 AM GMT
దిల్ రాజుకు సంక్రాంతి మిక్స్డ్ రిజల్ట్ తెచ్చిందే!
X
టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు పోయినేడాది పెద్దగా కలిసి రాలేదు. ఎప్పుడూ సక్సెస్ కు బ్రాండ్ అంబాజిడర్ లాగా కనిపించే అయన 2018లో మాత్రం ఫ్లాపులకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. మరి ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంది?

దిల్ రాజు 'వినయ విధేయ రామ' సినిమాను నైజాం.. ఉత్తరాంధ్ర ఏరియాలకు పంపిణీ హక్కులను తీసుకున్నాడు. ఇందులో నైజామ్ హక్కులు మాత్రమే రూ.18 కోట్లు. మొదటిరోజు భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజుకు డల్ అయింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే నైజాం.. ఉత్తరాంధ్రకు కలిపి రాజుగారికి దాదాపు రూ 10 కోట్లవరకూ నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కానీ దిల్ రాజు నిర్మించిన 'F2' మాత్రం హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలు తెచ్చిపెట్టేలా ఉంది. ఈ సినిమా బడ్జెట్ రూ.25 కోట్లలోపేనట. చాలా ఏరియాలకు మంచి లాభాలకే థియేట్రికల్ రైట్స్ ను అమ్మాడట. కొన్ని ఏరియాల్లో మాత్రం ఓన్ రిలీజుకు వెళ్ళాడని సమాచారం. ఈ సినిమా ఫుల్ రన్ లో దాదాపు రూ. 50 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉందని అంటున్నారు. థియేట్రికల్ కలెక్షన్స్ కాకుండా శాటిలైట్ రైట్స్.. డిజిటల్ రైట్స్.. డబ్బింగ్ హక్కులపై అదనంగా ఆదాయం ఉంటుంది. అంటే.. అటు వీవీఆర్ తో నష్టాలు.. ఇటు F2 తో లాభాలు. రాజుగారికి సంక్రాంతికే ఉగాది పచ్చడి తినిపిస్తున్నాయి ఈ రెండు సినిమాలు. F2 తో ఫన్.. VVR తో ఫ్రస్ట్రేషన్ అన్నమాట.