ఖైదీ కోసం దిల్ రాజు త్యాగం!

Wed Jan 11 2017 18:35:42 GMT+0530 (IST)

మెగాస్టార్ రీఎంట్రీ మూవీ "ఖైదీ నంబర్ 150" థియేటర్లలో దుమ్మురేపుతోంది. అభిమానులను విశేషంగా అలరిస్తోంది. బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగానే మెగా అభిమానులు ఆశించిన హంగులన్నీ ఈ చిత్రంలో ఉండటంతో... థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ స్పందన చూసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొంత త్యాగం చేశాడు అని చెప్పుకోవాలి!

విషయానికొస్తే... దిల్ రాజు నిర్మాతగా - శర్వానంద్ హీరోగా రూపొందిన చిత్రం శతమానం భవతి. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. రెండు పెద్ద సినిమాల తరువాత ఈ చిత్రం విడుదల చేస్తున్నారు. ఈ నెల 14న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం దిల్ రాజు కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లను బుక్ చేసుకున్నారు! పండుగ సీజన్ లో కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్ కు వస్తారన్నది దిల్ రాజు అంచనా. అయితే ఖైదీ కోసం తన వద్ద ఉన్న వాటి నుంచి ఓ 20 థియేటర్లను త్యాగం చేశాడట.

దీనికి సంబందించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో దిల్ రాజు చాలాసేపు భేటీ అయ్యారు. మరి ఈ భేటీ ఏయే విషయాలు చర్చకు వచ్చాయీ...ఈ 20 థియేటర్లను ఏ ప్రాతిపదికన వదులుకునేందుకు దిల్ రాజు సిద్ధపడ్డాడు ఇద్దరు నిర్మాత మధ్యా డీల్ కుదిరిందా లేక చిరుపై ప్రేమా అనేది ఇంకా బయటకి తెలీదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/